President Polls: కన్ఫ్యూజన్‌లో ఎన్డీయే అభ్యర్థికి ఓటేసిన సీతక్క.. అసలేమైందంటే..

ABN , First Publish Date - 2022-07-18T18:03:19+05:30 IST

కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క(Congress MLA Seethakka) తప్పులో కాలేశారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా(Yashwanth Sinha)కు..

President Polls: కన్ఫ్యూజన్‌లో ఎన్డీయే అభ్యర్థికి ఓటేసిన సీతక్క.. అసలేమైందంటే..

Hyderabad : కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క(Congress MLA Seethakka) తప్పులో కాలేశారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా(Yashwanth Sinha)కు ఓటు వేయబోయి పొరపాటున మొదటి ప్రాధాన్యతా ఓటును బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్మూ(Murmu)కు వేశారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా(Yashwanth Sinha)కు కాంగ్రెస్ పార్టీ(Congress Party) మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. మొదటి ప్రాధాన్యత ఓటును సీతక్క ముర్మూకు ఓటు వేసుకుంది. ఇంకా బ్యాలెట్‌(Ballet)లో సీతక్క ఓటు వేయలేదు. ఆర్వోతో ఆమె డిస్కస్ చేస్తున్నారు. కొత్త బ్యాలెట్ పత్రం కోసం అభ్యర్థిస్తున్నారు. ఫైనల్ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. అయితే సీతక్క పొరపాటున మొదటి ప్రాధాన్యతా ఓటును ముర్మూకి వేశారా? లేదంటే కావాలనే అణగారిన వర్గాలకు చెందిన మహిళ అనే సానుభూతితో ఓటేశారా? అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. 

ఓటు వేసి బయటకు వచ్చిన అనంతరం ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. తను పెన్సిల్ అనుకొని బ్యాలెట్ పైన గీయడంతో మార్కు పడిపోయిందన్నారు. అందుకోసం ప్రత్యేకంగా బ్యాలెట్ పేపర్ ఇవ్వాలని అడిగానన్నారు. కొత్త బ్యాలెట్ పేపర్ ఇవ్వలేదని.. దీంతో మళ్లీ అదే బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేసి వచ్చానని.. ఎన్నికల కమిషన్ ఎలా పరిగణిస్తుందో చూడాలని పేర్కొన్నారు.

Updated Date - 2022-07-18T18:03:19+05:30 IST