వ‌ల‌స కూలీలను ఆదుకునేందుకు ఆ యువ‌కుడు ఏం చేశాడంటే....

ABN , First Publish Date - 2020-05-24T12:59:14+05:30 IST

లాక్‌డౌన్‌ కారణంగా వ‌ల‌స కూలీలు ఇంటి బాట ప‌ట్టిన విష‌యం విదిత‌మే. జార్ఖండ్‌లోని తన గ్రామానికి వెళ్ల‌డానికి బ‌య‌లుదేరిన ఒక యువ‌కుడు యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆశ్రయం పొందుతున్న...

వ‌ల‌స కూలీలను ఆదుకునేందుకు ఆ యువ‌కుడు ఏం చేశాడంటే....

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా వ‌ల‌స కూలీలు ఇంటి బాట ప‌ట్టిన విష‌యం విదిత‌మే. జార్ఖండ్‌లోని తన గ్రామానికి వెళ్ల‌డానికి బ‌య‌లుదేరిన ఒక యువ‌కుడు యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆశ్రయం పొందుతున్న‌ వ‌ల‌స కూలీల అవ‌స్థ‌లను గ‌మ‌నించాడు. అంతే... ఇక ఇంటికి, వెళ్ల కూడ‌ద‌ని, వ‌ల‌స కూలీల‌కు సేవచేస్తూ ఇక్క‌డే ఉండిపోవాల‌ని నిర్ణ‌యించుకున్నాడు.  గత కొన్నిరోజులుగా కాశ్మీరీ గేట్ మెట్రో స్టేషన్‌లో ఆహారం పంపిణీలో వలంటీర్‌గా సేవ‌లందిస్తున్న జార్ఖండ్‌లోని డియోఘర్ జిల్లా నివాసి అజిత్ లోచన్ మిశ్రా(48) క‌థ ఇది. ప‌రిస్థితులు మెరుగుప‌డి వలస కూలీలందరూ షెల్ట‌ర్ హోం విడిచిపెట్టిన త‌రువాత‌నే తాను త‌న గ్రామానికి  వెళ్తానని అజిత్ చెప్పాడు. లాక్‌డౌన్ కార‌ణంగా ఉపాధి కోల్పోయాను. దీంతో యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు వచ్చాను. ఇక్కడి వ‌ల‌స కూలీల పరిస్థితి చూసి, వారికి సాయం అందించేందుకు వ‌లంటీర్‌గా చేరాన‌ని అన్నారు. ఇక్క‌డ ఆశ్ర‌యం పొందుతున్న‌ వారికి చేత‌నైనంత సాయం అందిస్తున్నాన‌ని తెలిపారు. 

Updated Date - 2020-05-24T12:59:14+05:30 IST