మూడు రోజుల తర్వాత డెలివరీ అని చెప్పి అదే రోజు రాత్రి ప్రసవం.. డాక్టర్ చేసిన ఒక్క మిస్టేక్‌తో..

ABN , First Publish Date - 2022-04-04T17:58:10+05:30 IST

ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మహిళా రోగికి చికిత్స...

మూడు రోజుల తర్వాత డెలివరీ అని చెప్పి అదే రోజు రాత్రి ప్రసవం.. డాక్టర్ చేసిన ఒక్క మిస్టేక్‌తో..

ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మహిళా రోగికి చికిత్స అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉదంతం తెరపైకి వచ్చింది. మరో బాధితురాలి ఫైల్ చూసి అదే పేరుగల మహిళకు వైద్యులు చికిత్స చేసిన ఉదంతం వెలుగు చూసింది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని పరిధిలోగల దుంగరఖెడ నివాసి శివనారాయణ శర్మ తన భార్యకిరణ్ శర్మ (గర్భిణి)ని వైద్య పరీక్షల నిమిత్తం చరక్ ఆసుపత్రికి తీసుకువచ్చాడు. రెండు మూడు రోజుల్లో డెలివరీ అవుతుందని డ్యూటీ డాక్టర్ తెలిపారు. దీంతో కిరణ్‌ను ఆస్పత్రిలోని రూం నంబర్ 304లో అడ్మిట్ చేశారు. రాత్రి 9.30 గంటలకు ఆ మహిళను ప్రసవం కోసం తీసుకెళ్లారు. కిరణ్‌ అనే మరో మహిళా పేషెంట్‌ ఫైల్‌ని చూసిన డ్యూటీ డాక్టర్‌..  గర్భిణి అయిన కిరణ్‌ శర్మకు చికిత్స చేయడం ప్రారంభించారు.

ఈ నేపధ్యంలో ఆమె ఆరోగ్యం క్షీణించింది. అలాగే ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డపై  ప్రతికూల ప్రభావాన్ని చూపింది. దీంతో ఆ మహిళకు ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులు ఆపరేషన్‌కు సిద్ధమయ్యారు. కొంత సమయం తరువాత డాక్టర్ ఇక్కడ ఆపరేషన్ చేయడానికి 10 గంటలు పడుతుందని చెప్పారు, ఎందుకంటే ఆపరేషన్‌కు తగిన ఏర్పాట్లు లేవని తెలిపారు. ఇంకో ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని సూచించారు.  అయితే ఇంత రాత్రి వేళ ఎక్కడికెళ్లాలని కుటుంబసభ్యులు వైద్యులను వేడుకున్నారు. దీంతో వైద్యులు  వెంటనే బ్లడ్‌ ఏర్పాటు చేయాలని చెప్పారు. అయితే బాధితురాలి కుటుంబీకులు రక్తాన్ని ఏర్పాటు చేయలేకపోయారు. రక్తం దొరక్కపోతే ఆపరేషన్ చేయలేనని వైద్యులు ఆపరేషన్ చేసేందుకు నిరాకరించారు. చేసేందేంలేక కుటుంబ సభ్యులు ఆ మహిళను నిజత్‌పురాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆపరేషన్ జరిగింది. కాగా మీడియాతో బాధితురాలు మాట్లాడుతూ తనకు వేరొకరి ఫైల్ చూసి చికిత్స చేశారని తాను ఆరోగ్యంగానే ఉన్నా, తన బిడ్డ పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులే దీనికి కారణమని ఆమె ఆరోపించింది. భార్య మాటలను ఆమె భర్త కూడా ధృవీకరించారు. భర్త ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తామని తెలిపారు. 




Updated Date - 2022-04-04T17:58:10+05:30 IST