Abn logo
May 28 2020 @ 03:48AM

రైతుల ఇంటికే విత్తనాలు

  • ఏడీఏ రవీంద్రభారతి

కంబకాయి (నరసన్నపేట), మే 27:  రైతుల ఇంటి వద్దకే వి వ్యవసాయ శాఖ ఏడీ రవీంద్రభారతి అన్నారు. బుధవారం కంబకాయి, జమ్ము, మడపాం, బొరిగివలస గ్రామాల్లో విత్తనాలు పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ ఏడాది నుంచి రైతులకు అవసరమైన ఎరువులు, పురుగు మందులు రైతుల ఇంటి వద్దకే పంపించడం జరుగుతుందన్నారు నరసన్నపేట, సారవకోట, జలుమూరు, పోలాకి మండలాల్లో 7 వేల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేస్తున్నామన్నారు. కార్య క్రమంలో ఏవో సునీత, స్థానిక నేతలు పోగోటి మోహనరావు, ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. 


సద్వినియోగం చేసుకోండి 

రేగిడి: ప్రభుత్వం సచివాలయాల ద్వారా రైతు చెంతకే విత్తనాలు, ఎరువులు పంపిణీ చేస్తోందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని వ్యవ సాయాధికారి మురళీకృష్ణ కోరారు. లక్ష్మీపురం, చాటాయివలస, వన్నలి, అంబఖండి, అంబాడ,  ఖండ్యాం తదితర గ్రామాల్లో బుధవారం విత్తనాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఈవోలు, స్థానిక నేతలు, రైతులు పాల్గొన్నారు. 


విత్తనాల కోసం 3383 మంది రైతుల నమోదు

జోనంకి (జలుమూరు): ఖరీఫ్‌ సీజన్‌కు విత్తనాల కోసం మండలంలో 3383 మంది రైతులు పేర్లు నమోదు చేసుకున్నారని వ్యవసాయాధికారి కె.సురేష్‌ పేర్కొన్నారు. బుధవారం గంగాధరపేట రైతు భరోసా కేంద్రంలో విత్తనాల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సన్న, చిన్నకారు రైతులందరికీ వరి విత్తనాలు అందిస్తున్నామన్నారు. నగదు చెల్లించిన రైతులందరికీ వరి విత్తనాలు అందచేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వీఏవో పి.రాజశేఖర్‌, దరివాడ మాజీ సర్పంచ్‌ పైడి విఠలరావు, పలువురు రైతులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement