బాలగంగనపల్లె రైత భరోసా కేంద్రంలో అధికారులతో జేసీ వెంకటేశ్వర్
గంగాధరనెల్లూరు, మే 25: కచ్చితంగా పంటవేసే రైతులకు మాత్రమే వేరుశనగ విత్తనకాయలు ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. బాలగంగనపల్లెలో బుధవారం ఆయన ఆర్‌బీకేను, సచివాలయాన్ని తనిఖీ చేశారు. విత్తనాల కోసం రిజి స్ర్టేషన్ చేసుకున్న రైతులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూడాలన్నారు. సచివాలయంలో సిబ్బంది బయోమెట్రిక్ హాజరును పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాల లబ్ధిదారులకు సహకరించాలని సూచించారు. తహసీల్దార్ ఇన్బనాథన్, ఏవో మురళి, బాలగంగనపల్లె సర్పంచ్ శేఖర్, ఈవోపీఆర్డీ శివయ్య, ఇన్‌చార్జ్ హౌసింగ్ ఏఈ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.