Tirumala: తిరుమలలో మంత్రి అప్పలరాజు హల్‌చల్‌

ABN , First Publish Date - 2022-07-29T02:05:22+05:30 IST

మంత్రి సీదిరి అప్పలరాజు (Seediri Appalaraju) గురువారం తిరుమల శ్రీవారి ఆలయంలో హల్‌చల్‌ చేశారు.

Tirumala: తిరుమలలో మంత్రి అప్పలరాజు హల్‌చల్‌

తిరుమల: మంత్రి సీదిరి అప్పలరాజు (Seediri Appalaraju) గురువారం తిరుమల శ్రీవారి ఆలయంలో హల్‌చల్‌ చేశారు. దాదాపు 150మంది అనుచరులతో ప్రొటోకాల్‌ దర్శనానికి వెళ్లి విమర్శల పాలయ్యారు. సాధారణంగా వీఐపీ(VIP)తో పాటు వారి కుటుంబ సభ్యులకు మాత్రమే ప్రొటోకాల్‌ దర్శనాన్ని కల్పిస్తారు. అయితే మంత్రి మాత్రం తన అనుచరులందరికీ ప్రొటోకాల్‌ దర్శనాలు కావాల్సిందేనంటూ పట్టుబట్టడంతో టీటీడీ (TTD) నిబంధనలు పక్కన పెట్టి మరీ ప్రొటోకాల్‌ దర్శనాలను చేయించింది. అప్పటికే క్యూలైన్‌లో వేచివున్న సామాన్య భక్తులు ప్రభుత్వంతో పాటు టీటీడీపై తీవ్రస్థాయిలో విమర్శల గుప్పించారు. ప్రజాసేవలో తరించాల్సిన మంత్రులు ఇలా సామాన్యులకు ఇబ్బంది కలిగేలా వ్యవహరించడం సరికాదంటూ మండిపడ్డారు. శ్రీవారి దర్శనం అనంతరం మంత్రి అప్పలరాజు మీడియాతో మాట్లాడుతూ దేవుడిని తనివితీరా చూడాలనే వెళ్లాం తప్ప.. ఎక్కడా అధికార హోదా ప్రదర్శించాలనేది తమ అభిమతం కాదని తెలిపారు. అందరం సామాన్య భక్తుల తరహాలోనే క్యూలైన్‌లో వెళ్లామని, ఎవ్వరికి ఇబ్బంది కలగనివ్వలేదని తెలిపారు

Updated Date - 2022-07-29T02:05:22+05:30 IST