Abn logo
May 29 2020 @ 04:48AM

పేర్లు నమోదైన రైతులకే విత్తనం : ఏపీ సీడ్స్‌ ఎండీ

కళ్యాణదుర్గం, మే 28 : ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకున్న రైతులకు సబ్సిడీ విత్తన వేరుశనగ అందజేస్తామని ఏపీ సీడ్స్‌ ఎండీ శేఖర్‌బాబు తెలిపారు. గురువారం ఆయన స్థానిక మార్కెట్‌యార్డులో విత్తన పంపిణీని పరిశీలించారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 87 శాతం విత్తన పంపిణీ ప్రక్రియను పూర్తి చేశామన్నారు. డీడీఏ బాలునాయక్‌, జేడీఏ దాస్‌, ఏడీఏ మల్లికార్జున, ఏఓ వెంకటకుమార్‌ ఆయన వెంట ఉన్నారు. కాగా విత్తన వేరుశనగ కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఆన్‌లైన్‌లో పేర్లు నమోదై నగదు చెల్లించినా విత్తనం అరకొరగా అందుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారంతో విత్తన పంపిణీ పూర్తవుతుందని వ్యవసాయాధికారులు ప్రకటించడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. 

 

Advertisement
Advertisement
Advertisement