Abn logo
May 8 2021 @ 01:39AM

ఆక్సిజన్‌ కొరత లేకుండా చూడండి: కలెక్టర్‌

చిత్తూరు కలెక్టరేట్‌, మే 7: ఆస్పత్రుల్లో కరోనా బాధితులకు ఆక్సిజన్‌ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ సూచించారు. శుక్ర వారం ఆయన జూమ్‌ కాన్పరెన్స్‌ ద్వారా జిల్లాలో కొవిడ్‌ పరిస్థితిపై నోడల్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాధితుల ఆరోగ్య స్థితిని బట్టి ఆక్సిజన్‌, ఐసీయూ లేదా సాధారణ బెడ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. అదే విధంగా ఆస్పత్రుల్లో రెమ్‌డిసీవర్‌ నిల్వలు, పడకలు, ఇతర సౌకర్యాలు సరిగా ఉన్నాయో లేదో పర్యవేక్షించాలన్నారు. ఇంటింటి ఫీవర్‌ సర్వే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించడం ద్వారా కొవిడ్‌ అనుమానితులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కాన్ఫరెన్స్‌లో జేసీలు వీరబ్రహ్మం, రాజశేఖర్‌, డీఎంఅండ్‌హెచ్‌వో పెంచలయ్య, డీసీహెచ్‌ఎస్‌ సరళమ్మ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement