ఉద్యోగ నిబంధనలు పాటించేలా చూడండి

ABN , First Publish Date - 2021-02-25T08:01:34+05:30 IST

ఆర్టీసీలో కోడ్‌ ఆఫ్‌ డిసిప్లిన్‌ పాటించడం లేదంటూ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని యాజమాన్యానికి లేబర్‌ కమిషనర్‌ సూచించారు.

ఉద్యోగ నిబంధనలు పాటించేలా చూడండి

ఆర్టీసీకి లేబర్‌ కమిషనర్‌ లేఖ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీలో కోడ్‌ ఆఫ్‌ డిసిప్లిన్‌ పాటించడం లేదంటూ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని యాజమాన్యానికి లేబర్‌ కమిషనర్‌ సూచించారు. సంస్థ చర్యలను నిరసిస్తూ ఈయూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్‌.బాబు, కె.రాజిరెడ్డి కార్మిక శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. జనవరి 29న నిరాహార దీక్షలు చేయడమేకాకుండా ఈ నెల 22న చలో కార్మిక శాఖ కమిషనరేట్‌ నిర్వహించారు. దీనికి స్పందించిన ఆ శాఖ కమిషనర్‌ అహ్మద్‌నదీం.. చర్యలు తీసుకోవాలని ఆర్టీసీకి లేఖ రాశారు. 

Updated Date - 2021-02-25T08:01:34+05:30 IST