పేద కుటుంబానికి పెద్ద కష్టం!

ABN , First Publish Date - 2022-06-27T06:20:10+05:30 IST

పేద కుటుంబానికి పెద్ద కష్టం!

పేద కుటుంబానికి పెద్ద కష్టం!
కుమారుడు బయ్యా సుబ్బరాజు వద్ద దీనస్థితిలో తల్లి

రోడ్డు ప్రమాదంలో తలకు గాయం..మాట్లాడలేని, నడవలేని స్థితిలో యువకుడు
నాలుగు సార్లు ఆపరేషన్‌ రూ.20 లక్షల ఖర్చు.. మందులకు నెలకు రూ.10 వేలు
దాతల సాయం ఎదురుచూపు

పాలకోడేరు, జూన్‌ 26: రెక్కాడితేగానీ డొక్కాడని పేద కుటుంబానికి పెద్దకష్టం వచ్చి పడింది. శృంగవృక్షం గ్రామంలో వేండ్ర వెళ్లే రహదారిలో బయ్యా వెంకట నాగేశ్వరరావు, రుక్మిణి దంపతులు కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ముగ్గురు మగపిల్లలు.. పెద్ద కొడుకు చనిపోగా మిగిలిన ఇద్దరికి వివాహాలు జరిపారు. రెండో కుమారుడు బయ్యా సుబ్బరాజు(26)ను రెండేళ్ల క్రితం తాడేపల్లిగూడెం సమీపంలో ఒక గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. తలకు బలమైన గాయమైంది. బ్రెయిన్‌కు ఆపరేషన్‌ చేశారు. తలకు నాలుగుసార్లు ఆప రేషన్‌ చేయడంతో ఉన్న 17 సెంట్ల భూమిని అమ్మి వైద్యం నిమిత్తం రూ.20 లక్షలు తల్లిదండ్రులు ఖర్చు చేశారు. వివాహమైన ఏడాదికే ఇలా జరగడంతో చంటిబడ్డతో భార్య పుట్టింటివద్దే ఉంటోంది. సుబ్బరాజు ఆలనాపాలనను తల్లిదండ్రులే చూస్తున్నారు. సరిగ్గా మాట్లాడం, నడవడం చేయలేడు. వైద్యానికి నెలకు రూ.10 వేల వరకు ఖర్చు అవుతోంది. స్థోమత లేకపోవడంతో కుటుంబసభ్యులు సుబ్బరాజుకు పింఛన్‌ ఇప్పించాలని వేడుకుంటున్నారు. మందుల ఖర్చు పెట్టు కోలేకపోతున్నామని, దాతలు ఆదుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. శృంగవృక్షం యూనియన్‌బ్యాంకు నెంబరు 0516101 00125157 ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌–యూబీ ఐఎన్‌ 0805165కు పంపగలరని, ఫోన్‌ నంబర్‌ 939 8008136లో సంప్రదించాలని కోరుతున్నారు.

Updated Date - 2022-06-27T06:20:10+05:30 IST