నల్లబడ్డ సముద్రుడు

ABN , First Publish Date - 2021-11-30T17:04:58+05:30 IST

బంగాళాఖాతంలో నీరు నల్లగా, మురికిగా మారింది. పది రోజుల నుంచి వరుసగా కురుస్తున్న వర్షాలకు నదులు, కాలువల నుంచి భారీగా వరద నీరు వచ్చి పడుతున్న విషయం తెలిసిందే. దీంతో కొన్నిచోట్ల సముద్రపు

నల్లబడ్డ సముద్రుడు

చెన్నై: బంగాళాఖాతంలో నీరు నల్లగా, మురికిగా మారింది. పది రోజుల నుంచి వరుసగా కురుస్తున్న వర్షాలకు నదులు, కాలువల నుంచి భారీగా వరద నీరు వచ్చి పడుతున్న విషయం తెలిసిందే. దీంతో కొన్నిచోట్ల సముద్రపు నీరు తీర ప్రాంతం దాటి చొచ్చుకు రాగా, కన్నియాకుమారి, కడలూరు తదితర ప్రాంతాల్లో వెనక్కి మళ్లింది. ఇదే సమయంలో ఇటీవల మెరీనాతీరంలో నీరు దుర్వాసన వేయడంతో సందర్శకులు అటువైపు వెళ్లలేకపోయారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం మెరీనా తీరం లోని సముద్రపు నీరు నల్లగా, మురికి కాలువనీరులా కనిపించింది. దీని గురించి స్థానిక జాలర్లు మాట్లాడుతూ.. భారీగా వరద నీరు చేరినప్పుడు సముద్రపు నీరు రంగు మారడం సహజమే కానీ, ఎన్నడూ ఇంతలా మురికిగా కనిపించలేదని తెలిపారు. ఇటీవల సముద్రంలో అనూహ్యమైన మార్పులు సంభవిస్తున్నాయని, దీనివల్ల ఏం ఉపద్రవం వచ్చిపడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-11-30T17:04:58+05:30 IST