- బయల్పడిన బండరాళ్లు
చెన్నై: ప్రముఖ పర్యాటక ప్రాంతం కన్నియా కుమారి తీరంలో మంగళవారం ఉదయం సముద్రం వెనక్కిమళ్లింది. దీంతో సముద్రపునీటిలో ఉండే బండరాళ్లన్నీ బయటకు వచ్చాయి. సునామీ ఉపద్రవం సంభవించిన 2004 నుంచి ఈ తీరంలో తరచూ సముద్రపు జలాలు వెనక్కి వెళ్ళటం ఆనవాయితీగా మారింది. అదే విధంగా అలల సందడి లేకుండా సముద్రం అప్పుడప్పుడూ నదిలా కనబడటమూ జరుగుతోంది. అదేవిధంగా రాక్షస అలలు ఎగసిపడి తీరం ముందుకు దూసుకు రావటమూ జరుగుతోంది. అమావాస్య, పౌర్ణమి దినాల్లో ఇక్కడి సముద్రం కల్లోలంగా మారుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం సముద్రం సుమారు 50 అడుగుల మేర వెనక్కిమళ్ళింది. దీనితో తీరంలోని ఉన్న బండరాళ్లు, ఇసుక మేటలు కనిపించడంతో పర్యాటకులు, స్థానికులు భీతిల్లారు. ఈ మార్పులను పట్టించుకోకుండా జాలర్లు ఎప్పటివలెనే నాటుపడవలు, మర పడవలతో సముద్రంలో చేపలవేటకు బయలుదేరారు.
ఇవి కూడా చదవండి