గండి క్షేత్రంలో భద్రత కట్టుదిట్టం

ABN , First Publish Date - 2020-09-17T16:57:05+05:30 IST

రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని..

గండి క్షేత్రంలో భద్రత కట్టుదిట్టం

నేటి నుంచి భక్తులకు దర్శనాలు


చక్రాయపేట(కడప): రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని గండిలో భద్రత కట్టుదిట్టం చేయాలని డీఎస్పీ వాసుదేవన్‌ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం సాయంత్రం దేవదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్‌ శంకరబాలాజి ఆధ్వర్యంలో డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలు పరిశీలించారు. సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు తదితర విషయాలపై చర్చించారు. గండి పరిసర ప్రాంతాల్లో ఇంకా ఎక్కడైనా సీసీ కెమెరాలు అమర్చాలా అన్న విషయంపై చర్చించారు. సెక్యూరిటీ గార్డులు మరికొంతమందిని నియమించాలని సూచించారు. అనంతరం అన్ని శాఖల అధికారులతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో పులివెందుల సీఐ రవీంద్రారెడ్డి, వేంపల్లె సీఐ వెంకటేశ్వర్లు, పర్సనల్‌ సెక్యూరిటీ సీఐ రవి, ట్రిపుల్‌ఐటీ ఎస్‌ఐ కృష్ణమూర్తి, తహసీల్దార్‌ వైఎస్‌ సత్యానందం, పీస్‌ కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


నేటి నుంచి భక్తులకు అనుమతి

గండి వీరాంజనేయస్వామి దేవస్థానంలో గురువారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, అనంతరం 3 గంటల నుంచి రాత్రి 7 గంట ల వరకు భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని శంకరబాలాజి తెలిపారు. కరోనా కారణంగా రద్దు చేసిన ఆకుపూజలు, వసతి గృహాలను మళ్లీ పునరుద్ధరించామన్నారు. భక్తులు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ దర్శనాలు చేసుకోవాలని తెలిపారు. 

Updated Date - 2020-09-17T16:57:05+05:30 IST