సెక్యూరిటీ కెమెరా ఈ ఫీచర్లు మిస్‌ కావద్దు

ABN , First Publish Date - 2021-12-25T05:43:18+05:30 IST

భద్రతకు సంబంధించి స్మార్ట్‌ కెమెరాలు, డోర్‌ బెల్స్‌ ఏర్పాటు చేసుకోవడం ఈ రోజుల్లో సర్వసాధారణమైంది. వీటితో అదనంగా మరింత రక్షణ చేకూరుతోంది. ...

సెక్యూరిటీ కెమెరా ఈ ఫీచర్లు మిస్‌ కావద్దు

భద్రతకు సంబంధించి స్మార్ట్‌ కెమెరాలు, డోర్‌ బెల్స్‌ ఏర్పాటు చేసుకోవడం ఈ రోజుల్లో సర్వసాధారణమైంది. వీటితో అదనంగా మరింత రక్షణ చేకూరుతోంది. ఇంట్లో ఉన్నా లేకున్నా నిరంతర నిఘాకు ఈ ఆధునిక పరికరాలు ఎంతగానో ఉపయోగపడతున్నాయి. పలు ఫీచర్లతో మార్కెట్‌లో ఇవి అందుబాటులో ఉంటున్నాయి. స్పేస్‌ విషయంలో వీటిలో కొన్ని లోకల్‌ స్టోరేజీని ఉపయోగించుకునేందుకు అనుమతిస్తాయి. మరి కొన్ని క్లౌడ్‌ స్టోరేజీకి అనుమతిస్తాయి. కొన్ని మోషన్‌ డిటెక్షన్‌కు అనుకూలంగా ఇంకొన్ని ంటికి నైట్‌ విజన్‌ సామర్థ్యం ఉంటుంది. అసలు మంచి కెమెరా అంటే కొన్ని ఫీచర్లు ఉండాలి. అవి ఉన్నప్పుడు అదనపు రక్షణ అన్న మాటకు అర్థం ఉంటుంది. అవేంటో చూద్దాం


  మోషన్‌ డిటెక్షన్‌

స్మార్ట్‌ ఫోన్ల నుంచి ల్యాప్‌టాప్‌ వరకు ఎందులో అయినా వేగానికి ప్రాధాన్యం ఉంది. సెక్యూరిటీ కెమెరాలకు అదే వర్తిస్తుందని చెప్పవచ్చు. వైఫై బలం, వేగాన్నిబట్టి  ఇదంతా ఆధారపడి ఉంటుందని మనకు తెలుసు. అయితే, మోషన్‌ డిటెక్షన్‌లో విశ్వసనీయత చాలా అవసరం. అది కొనుక్కున్న స్మార్ట్‌ పరికరంలో ఉన్నది, లేనిదీ ప్రధానాంశం అవుతుంది. అదే డోర్‌బెల్‌కు వర్తిస్తుంది. మోషన్‌ అంటే ఇక్కడ ప్రతి కదలికను సెక్యూరిటీ కెమెరా స్పష్టంగా పట్టుకోగలగాలి.


  స్మార్ట్‌ ఫోన్‌ యాప్‌

ఆన్‌లైన్‌ కనెక్టివిటీ ఈ రోజుల్లో చాలా ముఖ్యమైన విషయం. అంటే స్మార్ట్‌ఫోన్‌లోని యాప్‌తో అనుసంధానం ఏ స్థాయిలో ఉందన్నది చూసుకోవాలి. కొన్న కెమెరా,  యాప్‌ మధ్య సరైన పని సంబంధాలు ఉండాలి. కెమెరా సరిగ్గా పనిచేయాలంటే అందులో కొన్ని పరికరాలు పనిచేసే విధానం పక్కాగా ఉందో లేదో సరిచూసుకోవాలి. 


  కంపాటిబిలిటీ

కెమెరాల అనుకూలత కూడా ఇక్కడ పాయింటే. ఇన్‌స్టాంట్‌ నోటిఫికేషన్లతో మొదలుపెట్టి ఏ సమయంలోనైనా జరిగింది తెలుసుకునే వెసులుబాటు, ప్రత్యేకించి ఒక వీడియో క్లిప్‌ వంటి చర్యలు అన్నింటికీ రికార్డు చేసే వెసులుబాటు తదితరాలు కొనుగోలు చేసిన సెక్యూరిటీ కెమెరా సానుకూలంగా ఉండాలి. 


  రిజల్యూషన్‌

మంచి రిజల్యూషన్‌ సపోర్ట్‌ ఉండాలి. సాధారణంగా ఈ కెమెరాలు, డోర్‌బెల్స్‌కు 4కె రిజల్యూషన్‌ సామర్థ్యం ఉంటుంది. ఉదాహరణకు ఫైల్‌ 1080పి రిజల్యూషన్‌ ఉంటే, స్టోరేజీ సామర్థ్యం అందుకు తగ్గట్టు ఉండాలి. వైఫై సిగ్నల్‌ సామర్థ్యానికి అనువుగానే ఉంటాయి. నిజానికి 1080పి ఉన్నప్పుడే మంచి క్వాలిటీని పొందగలుగుతాం. అప్పుడే క్వాలిటీతో కూడిన ఔట్‌పుట్‌ లభిస్తుంది. 


 స్టోరేజీ టైప్‌

ఈ కెమెరాల్లో సాధారణంగా ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ అని స్టోరేజ్‌ ఆప్షన్స్‌ రెండు రకాలు. ఆఫ్‌లైన్‌ సెక్యూరిటీ కెమెరాల్లో మన స్మార్ట్‌ఫోన్‌లో మాదిరిగా ఇన్‌బిల్ట్‌ స్టోరేజీ సామర్థ్యం ఉంటుంది. యుఎ్‌సబి సపోర్ట్‌తో స్టోరేజీ సామర్ధ్యాన్ని వయా హార్డ్‌లైన్‌ డ్రైవ్‌తో పెంచుకోవచ్చు. ఆన్‌లైన్‌ స్టోరేజీ చందా చెల్లింపుతో లభిస్తుంది. కెమెరాల సంఖ్య, వాటి రికార్డింగ్‌ పరిమితి తదితర ఫీచర్లను అనుసరించి నెల, వార్షిక చందాలు స్టోరేజీ కోసం ఉంటాయి. 


  కలర్డ్‌ నైట్‌ విజన్‌

స్మార్ట్‌ ఫోన్‌, డోర్‌బెల్‌కు నైట్‌ విజన్‌ సాధారణంగా ఉంటుంది. అదే కలర్‌లో కావాలని అనుకుంటే మరికొంత ఖర్చు అవుతుంది. బడ్జెట్‌ అనుకూలిస్తే కలర్డ్‌ నైట్‌ విజన్‌ ఉన్నవి కొనుగోలు చేయడమే మంచిది.


 టూ వే ఆడియో

గోడలో అమర్చడం, బెల్‌ మోగడం మనకు తెలిసిందే. అయితే స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్‌ అయితే, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వాట్సాప్‌ మెసేజ్‌ మాదిరిగా పనిచేయాలి.  రెండూ నెట్‌తో కనెక్ట్‌ అయి ఉంటే సరిపోతుందన్న మాట. మనం ఎక్కడ ఉన్నప్పటికీ సెక్యూరిటీని మానిటరింగ్‌ చేసుకోవచ్చు.


  ఇన్‌బిల్ట్‌ అలారమ్‌ సిస్టమ్‌

ఇన్‌బిల్ట్‌ అలారమ్‌ ఉండే పరికరం కొనుగోలు చేయడం మంచిది. లోపలకు చొరబడే వ్యక్తి ఔట్‌సైడ్‌ ఉండే వాటిని బద్దలు కొట్టి కనెక్ట్‌ కాకుండా చేయవచ్చు. అదే ఇన్‌బిల్ట్‌ అలారమ్‌ ఉంటే ఆ రకం ఇబ్బందులు ఎదురుకావు.

 

  పాన్‌, టిల్ట్‌, జూమ్‌

ఇంటి చుట్టూ మైదానం పరిధి కూడా కవర్‌ కావాలంటే ఈ మూడూ చాలా అవసరం. కనీసం మోషన్‌ ట్రాకింగ్‌ వంటి ఫీచర్లు అయినా ఉండాలి. దీంతో యాప్‌ ఉపయోగించి కెమెరాపై అదుపు తెచ్చుకోవడమే కాకుండా, మానిటరింగ్‌ కూడా చేసుకోవచ్చు. 


ఫీల్డ్‌ ఆఫ్‌ వ్యూ

ఇదో ముఖ్యమైన అంశం. 360 డిగ్రీలు అన్న పదంతో అయోమయానికి లోనుకావద్దు. ఫీల్డ్‌ ఆఫ్‌ వ్యూ అంటే ఏ పరిధి మేరకు కెమెరా మానిటర్‌ చేస్తుందన్నది తేల్చే విషయం. అందుకని కనీసం అది 110 డిగ్రీలు ఉండేలా చూసుకుని కొనుగోలు చేసుకుంటే మంచిది. 


అడ్వాన్స్‌డ్‌ డిటెక్షన్‌

కుక్కలు తిరుగుతున్నాయని చెప్పి రాత్రుళ్ళు వాకింగ్‌ను వద్దు అనుకోరాదని భావించిన పక్షంలో అడ్వాన్స్‌డ్‌ డిటెక్షన్‌ మంచిది. యానిమల్‌ డిటెక్షన్‌, వాయిస్‌ డిటెక్షన్‌, ఫేస్‌ డిటెక్షన్‌ మరికొన్ని గ్యాస్‌, స్మోక్‌ డిటెక్షన్‌ ఫీచర్స్‌తో ఉంటాయి. వాటిని కొనుగోలు చేయడం మంచిది. 

Updated Date - 2021-12-25T05:43:18+05:30 IST