సికింద్రాబాద్ క్లబ్ నాకు ఇల్లులాంటిది: మాజీ ఆర్మీ అధికారి

ABN , First Publish Date - 2022-01-16T15:51:41+05:30 IST

సికింద్రాబాద్‌ క్లబ్‌లో అగ్నిప్రమాదంపై మాజీ ఆర్మీ అధికారి విజయ్ స్పందించారు.

సికింద్రాబాద్ క్లబ్ నాకు ఇల్లులాంటిది: మాజీ ఆర్మీ అధికారి

హైదరాబాద్: సికింద్రాబాద్‌ క్లబ్‌లో అగ్నిప్రమాదంపై మాజీ ఆర్మీ అధికారి విజయ్ స్పందించారు. అగ్నిప్రమాదంలో సికింద్రాబాద్ క్లబ్ మెయిన్ హాల్ పూర్తిగా కాలిపోయిందన్నారు. సికింద్రాబాద్ క్లబ్ తనకు ఇల్లు లాంటిదని తెలిపారు. మూడు తరాలుగా తమకు సికింద్రాబాద్ క్లబ్‌లో మెంబెర్ షిప్ ఉందని చెప్పారు. మెయిన్ హాల్ పూర్తిగా దగ్ధం అయ్యిందని విజయ్ వెల్లడించారు. 


సికింద్రాబాద్ క్లబ్‌లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని పది ఫైరింజన్లతో మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ఈ అగ్నిప్రమాదంలో సుమారు రూ.20 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. దాదాపు 20 ఎకరాల స్థలంలో ఈ క్లబ్‌ను 1878 బ్రిటీష్ హయాంలో నిర్మించారు. ఇది భారతీయ వారసత్వ సంపదగా గుర్తించి 2017లో పోస్టల్ కవర్‌ కూడా విడుదల చేశారు. కాగా.. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2022-01-16T15:51:41+05:30 IST