సికింద్రాబాద్‌ విద్యార్థిని పెయింటింగ్‌ ఇరాన్‌లో ప్రదర్శన

ABN , First Publish Date - 2021-07-02T18:28:26+05:30 IST

హైదరాబాద్‌లోని ఇరాన్‌ కాన్సులేట్‌ జనరల్‌, సామాజిక కార్యకర్త, సాంస్కృతిక చిత్ర నిర్మాత...

సికింద్రాబాద్‌ విద్యార్థిని పెయింటింగ్‌ ఇరాన్‌లో ప్రదర్శన

హైదరాబాద్ సిటీ/రెజిమెంటల్‌బజార్‌ : హైదరాబాద్‌లోని ఇరాన్‌ కాన్సులేట్‌ జనరల్‌, సామాజిక కార్యకర్త, సాంస్కృతిక చిత్ర నిర్మాత మహేశ్వర్‌రావు ఆధ్వర్యంలో గత సంవత్సరం నిర్వహించిన పెయింటింగ్‌ పోటిల్లో శివాజీనగర్‌ ఠాగూర్స్‌ హోం పాఠశాలకు చెందిన విద్యార్థిని ప్రతిభ ప్రదర్శించింది. ఎ కలర్‌ ఫ్రం ఈస్ట్‌ పేరుతో నిర్వహించిన ఈ పోటీల్లో సుమారు 200 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొనగా అందులో 40 పాఠశాలలను ఎంపిక చేశారు. ఇంటులో ఠాగుర్స్‌ హోం పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని చేతనసేన్‌ ‘నాజిర్‌ అల్‌-ముల్క్‌ మసీద్‌ ఇన్‌ షిరాజ్‌’ పేరుతో మసీద్‌ పెయింటింగ్‌ వేశారు. ఇరాన్‌లోని షిరాజ్‌ నగరంలోని నమాజీ మెట్రో స్టేషన్‌లో షిరాజ్‌ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పెయింటింగ్స్‌ ప్రదర్శనలో చేతనసేన్‌ వేసిన మసీద్‌ పెయింటింగ్‌ను పోస్టర్‌గా ఉంచారు. ఈ ప్రదర్శన జూలై 6 వరకు ఇరాన్‌లో కొనసాగుతుంది. ఈ సందర్భంగా చేతనసేన్‌ను పాఠశాల ప్రిన్సిపాల్‌ గాయత్రి శంకర్‌, ఉపాధ్యాయులు అభినందించారు.

Updated Date - 2021-07-02T18:28:26+05:30 IST