సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2022-01-12T14:57:26+05:30 IST

సికింద్రాబాద్ రాణిగంజ్‌లోని ఫిలిప్స్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్: సికింద్రాబాద్ రాణిగంజ్‌లోని ఫిలిప్స్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని ఐదు ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వలన ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. 

Updated Date - 2022-01-12T14:57:26+05:30 IST