మంత్రి మల్లారెడ్డిని బర్తరఫ్‌ చేయాలి

ABN , First Publish Date - 2021-06-18T15:16:28+05:30 IST

రక్షణ శాఖ లీజు బంగ్లాలో పేకాట క్లబ్‌తోపాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న మంత్రి మల్లారెడ్డిని అరెస్టు చేసి

మంత్రి మల్లారెడ్డిని బర్తరఫ్‌ చేయాలి

సికింద్రాబాద్‌/బోయిన్‌పల్లి: రక్షణ శాఖ లీజు బంగ్లాలో పేకాట క్లబ్‌తోపాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న మంత్రి మల్లారెడ్డిని అరెస్టు చేసి మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, కంటోన్మెంట్‌ మాజీ ఉపాధ్యక్షుడు జె. రామకృష్ణ, సికింద్రాబాద్‌ మహంకాళి జిల్లా ఉపాధ్యక్షుడు ఆకుల నాగేష్‌ డిమాండ్‌ చేశారు. బోయిన్‌పల్లిలో మల్లారెడ్డి ఫంక్షన్‌ హాల్‌లో పేకాట ఆడుతుండగా మంత్రి సోదరుడు సీహెచ్‌ నర్సింహారెడ్డిసహా 13 మందిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో గురువారం బీజేపీ నాయకులు మల్లారెడ్డి ఫంక్షన్‌ హాల్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. 

Updated Date - 2021-06-18T15:16:28+05:30 IST