సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలి

ABN , First Publish Date - 2021-10-19T06:17:44+05:30 IST

సచివాలయ సిబ్బంది విధిగా సమయపాలన పాటించాలని పాడేరు సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ అన్నారు. సోమవారం కిలగాడ, కించాయిపుట్టు, కరిముక్కిపుట్టు, సుజనకోట సచివాలయాలను, స్థానిక తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు.

సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలి
కిలగాడ సచివాలయ రికార్డులు పరిశీలిస్తున్న సబ్‌కలెక్టర్‌ అభిషేక్‌


పాడేరు సబ్‌కలెక్టర్‌ అభిషేక్‌

ముంచంగిపుట్టు, అక్టోబరు 18: సచివాలయ సిబ్బంది విధిగా  సమయపాలన పాటించాలని పాడేరు సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ అన్నారు. సోమవారం కిలగాడ, కించాయిపుట్టు, కరిముక్కిపుట్టు, సుజనకోట  సచివాలయాలను, స్థానిక తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. వివిధ ధ్రువపత్రాల దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధ్రువపత్రాలు పెండింగ్‌ ఉండకూడదని,  ప్రతీ అర్జీదారుడికి జవాబుదారితనంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా సబ్‌కలెక్టర్‌ అభిషేక్‌ మాట్లాడుతూ.. సమస్యలపై సచివాలయాల్లో అందిన దరఖాస్తులను పరిశీలించి సకాలంలో పరిష్కరిస్తామన్నారు. ప్రధానంగా రేషన్‌ కార్డులు, పింఛన్లలో నెలకొన్న సాంకేతిన సమస్యలను పరిష్కరిస్తామన్నారు. సబ్‌ కలెక్టర్‌కు పలు సమస్యలపై ప్రజలు, సర్పంచ్‌లు వినతిపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ ఎం. శ్యాంబాబు, ఎంపీడీవో ఏవీవీ కుమార్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-10-19T06:17:44+05:30 IST