సచివాలయ సిబ్బంది జాస్తి.. సేవలు నాస్తి

ABN , First Publish Date - 2021-06-22T06:32:03+05:30 IST

మండలంలో గ్రామ సచివాలయ వ్యవస్థ అ భాసుపాలవుతోంది. రెండు వేల జనాభా కలిగిన గ్రామాలకు సచివాలయా లను ఏర్పాటు చేస్తూ స్థానికంగానే సేవలు అందించాలని ప్రభుత్వం సంక ల్పించింది.

సచివాలయ సిబ్బంది జాస్తి.. సేవలు నాస్తి
తాళ్లకెర సచివాలయం

గుమ్మఘట్ట, జూన 21 : మండలంలో గ్రామ సచివాలయ వ్యవస్థ అ భాసుపాలవుతోంది. రెండు వేల జనాభా కలిగిన గ్రామాలకు సచివాలయా లను ఏర్పాటు చేస్తూ స్థానికంగానే సేవలు అందించాలని ప్రభుత్వం సంక ల్పించింది. అందులో భాగంగా పది మంది సచివాలయ సిబ్బందిని నియమించింది. వారికి సహకారంగా వలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తూ, 50 ఇళ్లకు ఒకరిని నియమించారు. ఇకపై గ్రామాల్లోని ప్రజలు తమ సమస్యల ప రిష్కారానికి మండల కార్యాలయాలకు వెళ్లే ప్రసక్తి లేకుండా అన్ని సేవలు మీ ముగింటే తీర్చుకోవాలన్న సదుద్దేశంతో శ్రీకారం చుట్టారు. కాగా రెండే ళ్లు కావస్తున్నా గ్రామ సచివాలయ వ్యవస్థలో ప్రజలకు నాణ్యమైన సేవలందించడంలో సిబ్బంది మీనమేషాలు లెక్కిస్తోంది.


తూతూమంత్రంగా సిబ్బంది విధులకు హాజరు

మండలంలో 15 పంచాయతీలు వుండగా జనాభా ప్రాతిపదికన 17 గ్రా మ సచివాలయాలను ఏర్పాటు చేశారు. ఒక్కో సచివాలయానికి పది మంది చొప్పున 170 మంది సిబ్బందిని కేటాయించారు. కొన్ని సచివాలయాల్లో ఒ కరిద్దరు సిబ్బంది మాత్రం ఖాళీగా వుండగా, మొత్తం 156 మంది సిబ్బంది నిత్యం విధులకు హాజరవుతున్నట్లు అధికారుల రికార్డుల ద్వారా తెలుస్తోం ది. అయితే కొంతమంది సిబ్బంది తూతూమంత్రంగా విధులకు హాజరవుతుండగా, మరికొంతమంది ఏకంగా డుమ్మా కొడుతున్నారు. సచివాలయ వ్యవస్థ ఏర్పడిన నాటి నుంచి గ్రామస్థాయిలో వలంటీర్లు ప్రజల నుంచి స మస్యలను గుర్తించి సచివాలయానికి తీసుకెళ్లగా, సచివాలయంలో ము గ్గురు సిబ్బంది మాత్రమే ప్రజలకు సేవలందిస్తున్నట్లు తెలుస్తోంది. పింఛ న్ల మంజూరు, ఆసరా, చేయూత లాంటి సంక్షేమ పథకాలను వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ నిర్వహిస్తుండగా, వ్యవసాయ శాఖ విభాగంలో విత్తనాల పంపిణీ, రైతు భరోసా, పంటల బీమా లాంటి సౌకర్యాలను ఎంపీఈవోలు, కుల, ఆ దాయ ధ్రువపత్రం, ఇతర సర్టిఫికెట్లు నమోదు లాంటివి డిజిటల్‌ అసిస్టెం ట్‌ ద్వారా నిత్యం ప్రజలకు సేవలందుతున్నాయి. ఇక మిగతా శాఖల్లో వి ద్యుత శాఖకు సంబంధించిన అధికారి గ్రామాల్లో విద్యుత సేవలు అందిస్తుండగా, సర్వే విభాగం అధికారి, గ్రామ పోలీసు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ తో పాటు ఇతర సిబ్బందికి ఎటువంటి ఉద్యోగ బాధ్యతలు లేక సచివాలయంలో కాలయాపన చేసి ఇళ్లకు వెళుతున్నారు. ప్రభుత్వం ఆయా శాఖల ద్వారా నిర్దేశించిన సేవలను అందించడంలో ఆ శాఖాధికారులు చొరవ చూ పడం లేదన్న విమర్శలున్నాయి. పర్యవేక్షించే గ్రామ పంచాయతీ కార్యదర్శు లు తమ విధులను విస్మరిస్తూ తమ సేవలను సైతం సచివాలయ సిబ్బందికి వదిలేసి విధులకు డుమ్మాకొడుతున్నారు. గ్రామ సచివాలయాలపై ప్ర త్యేక తనిఖీలు చేపట్టకపోవడంతో సచివాలయ సిబ్బంది ఆడిందే ఆట పా డిందే పాటగా కొనసాగుతోంది.


మభ్యపెడుతున్న మండలస్థాయి అధికారులు

మండల స్థాయి అధికారులు సచివాలయలవైపు కన్నెత్తి కూడా చూడ టం లేదు. గతంలో ప్రజాసేవలను పరిష్కరించడంలో కృషి చేసిన మండల అధికారులు ఇప్పుడు సచివాలయాలపై భారం వేస్తూ తమ సేవలు కింది స్థాయి అధికారుల చేతుల్లో వున్నాయంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇటీవల వ్యవసాయ శాఖలో రైతులకు గ్రామ సచివాలయ సిబ్బంది పం టల బీమా, పంటనష్ట పరిహారం జాబితాలో పేర్లు  సక్రమంగా నమోదు చేయలేదంటూ రైతులు ఆరోపించారు. మండల వ్యవసాయాధికారి మా త్రం గ్రామ సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే రైతులకు అన్యాయం జరిగిందంటూ పేర్కొంటుండగా రైతులు వ్యవసాయాధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో గ్రామస్థాయి ఉద్యోగులను పర్యవేక్షించాల్సిన మండల స్థాయి అధికారి ఇలా తప్పించుకునే విధంగా మభ్యపెట్టి మాట్లాడటం పట్ల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ వల్ల సరియైున సేవలు అందక ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. ఇప్పటికైనా సచివాలయ సేవలు గ్రామ ప్రజలకు చేరువయ్యేలా మండల స్థాయి అధికారులు చొరవచూపాలని ప్రజలు కోరుతున్నారు.  


సచివాలయాలను నిత్యం పర్యవేక్షిస్తున్నాం: 

శివరామ్‌ప్రసాద్‌ రెడ్డి, ఎంపీడీవో 

గ్రామ సచివాలయాలను నిత్యం పర్యవేక్షిస్తూ తనిఖీలు చేపడుతు న్నాం. సిబ్బంది నిర్లక్ష్య వైఖరితో ప్రజలకు సేవలందించకుండా విధులకు డుమ్మాకొడితే అలాంటి వారిపై చర్యలకు సిఫారసు చేశాం. కొంతమంది గ్రామాల్లో ఇతర విధులకు వెళ్లినప్పుడు మూమెంట్‌ రిజిస్టర్‌లో నమోదు చేసి వెళ్లాలి. అలా నమోదు చేయకుండా కార్యాలయంలో గైర్హాజరు కనిపిస్తే వారిని సస్పెండ్‌ చేసేందుకు సిఫారసు చేస్తాం. 



Updated Date - 2021-06-22T06:32:03+05:30 IST