రేపటి నుంచి సచివాలయ పరీక్షలు

ABN , First Publish Date - 2020-09-19T10:20:26+05:30 IST

రెండో విడత గ్రామ, వార్డు సచివాలయాల పోస్టు ల భర్తీకి ఈనెల 20వ తేదీ నుంచి రాత పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఈ మేరకు

రేపటి నుంచి సచివాలయ పరీక్షలు

అన్ని ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రాంగం 

1,338 పోస్టులకు 1.6 లక్షల అభ్యర్థుల పోటీ 

పశుసంవర్థకశాఖ గ్రామ సహాయకుల పోస్టులు 531

జిల్లావ్యాప్తంగా మొత్తం 336 కేంద్రాల్లో పరీక్షలు 


కాకినాడ (ఆంధ్రజ్యోతి) : రెండో విడత గ్రామ, వార్డు సచివాలయాల పోస్టు ల భర్తీకి ఈనెల 20వ తేదీ నుంచి రాత పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఈ మేరకు జిల్లాలో ఖాళీగా ఉన్న 1,338 ఉద్యోగాలకు 1,06,449 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జనవరిలో వెలువడిన నోటిఫికేషన్‌ ప్రకారం కరోనా లేకపోయి ఉంటే మార్చిలో పరీక్షలు జరిగి, ఈపాటికి పోస్టింగ్‌ల ప్రక్రియ పూర్తయ్యేది. మార్చి నుంచి కొవిడ్‌ ఉధృతమవ్వడంతో ఎప్పటికపుడు వాయిదా వేస్తూ వచ్చా రు. తేదీలు ఖరారవ్వడంతో ఈనెల 20 నుంచి 26 వరకు పరీక్షలకు మార్గం సుగమమైంది. ఇక పోస్టుల విషయం చూస్తే పశు సంవర్థకశాఖ గ్రామ సహా యకుల పోస్టులు 531. ఆయా కేటగిరీల్లో పంచాయతీ కార్యదర్శి, మహిళా పోలీసు, వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీ, వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌ పోస్టులు 129.


పంచాయతీ సెక్రటరీ (గ్రేడ్‌-6), డిజిటల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 129. సెరికల్చర్‌ విలేజ్‌ అసిస్టెంట్‌ పోస్టులు 2. వీఆర్వో, విలేజ్‌ సర్వేయర్‌ 36. విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌లు 118. విలేజ్‌ ఫిషరీస్‌ అసిస్టెంట్‌లు 8. వార్డు శానిటేషన్‌, ఎన్విరాన్‌మెంట్‌ సెక్రటరీలు 24. వార్డు ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులేషన్‌ సెక్రటరీలు 82. ఏఎన్‌ఎం, వార్డు హెల్త్‌ సెక్రటరీలు 58. విలేజ్‌ హార్టికల్చర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 161. పరీక్షల నిర్వహణకు జిల్లాలో 336 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 3,859 గదుల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతీ రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.


పరీక్షలకు సం బంధించి జిల్లాను మూడు క్లస్టర్లగా విభజించారు. అమలాపురం క్లస్టర్‌ పరిధి లో 64, కాకినాడ క్లస్టర్‌ పరిధిలో 166, రాజమహేంద్రవరం క్లస్టర్‌ పరిధిలో 106 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి రోజు 20న మూడు క్లస్టర్ల పరిధిలో పరీక్షలు జరుగుతాయి. 21 నుంచి 26 వరకు కాకినాడ అర్బన్‌, రూరల్‌ మండ లంలో మాత్రమే పరీక్షలు జరుగుతాయి. సెంటర్‌ ప్రత్యేకాధికారులు, ముఖ్య పర్య వేక్షకులు, హాల్‌ పర్యవేక్షకులు, పరిశీలకులు మొత్తం 5,826 మంది విధులు నిర్వ హిస్తారు. 25 మంది జిల్లా స్థాయి అధికారులతో ఫ్లైయింగ్‌ స్వ్కాడ్‌ ఏర్పాటు చేశారు. 24 శాటిలైట్‌ స్ర్టాంగ్‌ రూమ్స్‌ (పోలీస్‌ స్టేషన్లు), కాకినాడలో ఒక ప్రభుత్వ కల్యాణ మండపాన్ని ప్రధాన స్ర్టాంగ్‌ రూమ్‌గా ఏర్పాటు చేశారు. 


పరీక్షల నిర్వహణకు సిద్ధం : కలెక్టర్‌ 

పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు కోసం ఇప్పటికే కాకినాడ, రాజమహేంద్రవరం అర్బన్‌ ఎస్పీలు తమ సిబ్బందికి రూట్‌లు కేటాయించారు. పరీక్ష పేపర్‌లను స్ర్టాంగ్‌ రూమ్‌లకు తరలించడానికి పోలీస్‌ అధికారులకు తగిన సూచనలు జారీ చేశాం. పరీక్షలు జరుగు తేదీల్లో కేంద్రాల వద్ద ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది.

Updated Date - 2020-09-19T10:20:26+05:30 IST