అమరావతి: ప్రభుత్వం నుంచి హమీ వచ్చిన నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ నిరసనలను విరమించాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం నేత బీఎన్ అంజన్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఆయన మా్ట్లాడుతూ ఉద్యోగుల తరపున ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్‌తో మాట్లాడామన్నారు. సీఎం మానసపుత్రిక అయిన ఈ వ్యవస్థకు అన్యాయం చేయబోరని ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పారని ఆయన పేర్కొన్నారు. జూన్ నెలాఖరుకు ఖచ్చితంగా ప్రోబిషన్ డిక్లేర్ చేస్తారని, అవసరం అయితే రాతపూర్వకంగా ఇస్తామన్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వం నుంచి హామీ వచ్చిన నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులు నిరసనలను విరమించామలన్నారు. వారందరూ విధులకు హాజరు కావాలని విజ్జప్తి చేస్తున్నామన్నారు.
ఇవి కూడా చదవండి