అర్ధంతరంగా ఆగిన సచివాలయ భవన నిర్మాణాలు

ABN , First Publish Date - 2021-04-16T06:33:34+05:30 IST

గ్రామ సచివాలయ వ్యవస్థతోనే మెరుగైన పా లన సాధ్యమని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం.. సచివాలయాలకు భ వనాలు నిర్మించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.

అర్ధంతరంగా ఆగిన సచివాలయ భవన నిర్మాణాలు
హనిమిరెడ్డి పల్లిలో పూర్తికాని సచివాలయ భవన నిర్మాణ పనులు

బిల్లులు మంజూరులో జాప్యంతోనే ఆగిన పనులు

అద్దె భవనాల్లో ఉద్యోగుల అవస్థలు 


బెళుగుప్ప, ఏప్రిల్‌ 15: గ్రామ సచివాలయ వ్యవస్థతోనే మెరుగైన పా లన సాధ్యమని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం.. సచివాలయాలకు భ వనాలు నిర్మించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మండల వ్యాప్తంగా 14 సచివాలయాలకు సొంత భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుం ది. ఒక్కో భవనానికి రూ.40లక్షలు మంజూరు చేసింది. నిర్మాణ పనులు చే పడుతున్న కాంట్రాక్టర్లు, వైసీపీ నాయకులు బిల్లులు మంజూరు కాకపోవ డంతో అర్ధంతరంగా నిర్మాణ పనులు ఆపేశారు. 4 నెలలకు పైగా బిల్లులు అందలేదని వాపోతున్నారు. సకాలంలో బిల్లుల మంజూరు కాక, నిర్మా ణాలకు తెచ్చుకున్న డబ్బుకు వడ్డీ కూడా కట్టలేక ఇబ్బంది పడుతున్న మంటూ వాపోతున్నారు.


ప్రస్తుతం ఒక బిల్లు మాత్రమే మంజూరైంది. బె ళుగుప్ప, కాలువపల్లి, శ్రీరంగపురం, నరసాపురం గ్రామ సచివాలయాల్లో 80 శాతం పనులు జరిగాయి. మిగిలిన గ్రామాల్లో అర్ధంతరంగా ఆగిపోయాయి. పలుచోట్ల పిల్లర్లకే పరిమితమయ్యాయి. సొంత భవనాలు లేక  అద్దె భవనాల్లోనే కార్యాలయాలు కొనసాగిస్తున్నారు. ఇరుకుగదుల్లోనే కనీ సం కంప్యూటర్లు ఉంచుకోవడానికి వీలుకాని విధంగా ఉండటంతో సిబ్బం ది అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా బిల్లులు మంజూరు చేసి, భవన నిర్మాణాలు వేగవంతం చేయాలని స్థానికులు కోరుతున్నారు. 


బిల్లుల మంజూరుకు చర్యలు

సుధాకర్‌, ఇంజనీర్‌, పంచాయితీరాజ్‌ శాఖ, బెళుగుప్ప

సచివాలయ భవన నిర్మాణ బిల్లుల మంజూరుకు నివేదికలు పంపాం. నిధులు రాగానే పనుల వేగవంతానికి చర్యలు తీసుకుంటాం. 



Updated Date - 2021-04-16T06:33:34+05:30 IST