Abn logo
Sep 22 2021 @ 17:26PM

లాడ్జిలో ఒక టేబుల్.. తొంగి చూస్తే టన్నెల్

కర్ణాటక: తమ రాజ్యంపై ఏ రాజైనా దండెత్తితే తప్పించుకునేందుకు రహస్య మార్గాల్లో మారు వేషాల్లో రాజ్యంలో సంచరించడానికి రాజులు సొరంగాలు మార్గాలను ఏర్పాటు చేసుకునే వారు. ఇప్పుడు మనకు అక్కడక్కడ కనిపిస్తున్న సొరంగాలు అలాంటివే. నాటి రాజుల ఎత్తుగడ వ్యభిచార నిర్వాహకులకు భలే నచ్చినట్టుంది. పోలీసులు దాడులు చేస్తే తప్పించుకోవడానికి ఏకంగా ఓ సొరంగాన్ని నిర్మించుకున్నారు. 

కర్ణాటకలోని తుమకూరు హైవే పక్కన కుప్పలు కుప్పులుగా వాడి పడి ఉన్న కండోమ్స్ కలకలం రేపాయి. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కండోమ్స్ డంప్‌పై విచారణ చేపట్టారు. ఆ విచారణలో భాగంగా నందిని డీలక్స్ లాడ్జి వద్దకు వచ్చి ఆగిపోయారు. లాడ్జిలో నిర్మాహకులను తమదైన శైలిలో విచారించగా అసలు నిజంకక్కేశారు. లాడ్జి నుంచి బయటకు సొరంగం తవ్వినట్టు తెలుసుకుని పోలీసులు విస్తుపోయారు. పోలీసులు వచ్చిన సమాచారం అందుకుని సొరంగం నుంచి పాక్కుంటూ పారిపోతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...