కేరళ సమీపంలో రహస్య దీవి!

ABN , First Publish Date - 2021-06-22T06:58:19+05:30 IST

గూగుల్‌ మ్యాప్స్‌లో కనిపిస్తున్న ఓ దీవి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ఎం దుకంటే..

కేరళ సమీపంలో రహస్య దీవి!

 గూగుల్‌ మ్యాప్స్‌లో ఉన్నా.. కనిపించని వైనం

కొచి, జూన్‌ 21: గూగుల్‌ మ్యాప్స్‌లో కనిపిస్తున్న ఓ దీవి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ఎం దుకంటే.. నిజంగా ఆ ప్రాం తానికి వెళ్తే.. అక్కడ ఏ దీవీ కనిపించదు! చెల్లనం కర్షిక పర్యాటక అభివృద్ధి సంస్థ, కేరళలోని కొచి సమీపంలో చిక్కు డు గింజ ఆకారంలో ఉన్న ఓ దీవిని గూగుల్‌ మ్యాప్స్‌లో నాలుగేళ్ల క్రితం గుర్తించింది. ఈ దీవి 8 కిలోమీటర్ల పొడవు, 3.5 కిలోమీటర్ల వెడల్పు ఉంది.


ఇదేమిటో తెలుసుకోవాలని కోరుతూ కేరళ మత్స్య, మహాసముద్ర అధ్యయన విశ్వవిద్యాలయానికి(కుఫోస్‌) ఆ సంస్థ లేఖ రాసింది. మ్యాప్స్‌లో కనిపిస్తున్నా.. సముద్ర ఉపరితలంపై ఎలాంటి నిర్మాణమూ లేకపోవడంతో, ఇది నీటి అడుగున ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. నీటి ప్రవాహం లేదా కోత వల్ల నీటి అడుగున ఇలాంటి నిర్మాణం ఏర్పడి ఉండొచ్చని వారి అంచనా. ఇదేమిటో తేల్చేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


Updated Date - 2021-06-22T06:58:19+05:30 IST