Radhakrishnan: రేషన్‌ దుకాణాల్లో 5 కిలోల గ్యాస్‌ సిలిండర్‌

ABN , First Publish Date - 2022-10-03T12:49:47+05:30 IST

రేషన్‌ షాపుల్లో 5 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ పథకం ఈ నెల 6 నుంచి ప్రారంభిస్తామ ని సహకార శాఖ కార్యదర్శి డా.జె.రాధాకృష్ణన్‌(Dr. J. Radhakrishnan)

Radhakrishnan: రేషన్‌ దుకాణాల్లో 5 కిలోల గ్యాస్‌ సిలిండర్‌

                             - సహకార శాఖ కార్యదర్శి రాధాకృష్ణన్‌


పెరంబూర్‌(చెన్నై), అక్టోబరు 2: రేషన్‌ షాపుల్లో 5 కిలోల గ్యాస్‌ సిలిండర్‌   పథకం ఈ నెల 6 నుంచి ప్రారంభిస్తామ ని సహకార శాఖ కార్యదర్శి డా.జె.రాధాకృష్ణన్‌(Dr. J. Radhakrishnan) తెలిపారు. మదురై జిల్లాల్లోని పలు రేషన్‌ దుకాణాలు, ధాన్యం నిల్వ కేంద్రాలను పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడు తూ, రేషన్‌ దుకాణాల్లో నాణ్యమైన సరుకులు అం దించాలనే లక్ష్యంతో సీఎం  స్టాలిన్‌ చర్యలు చేపట్టారని, అందులో భాగంగా 1,000 కార్డులున్న ప్రాంతాల్లో అదనపు దుకాణాలు ఏర్పాటుచేయాలని ఆదేశించారన్నారు. రేషన్‌ బియ్యం స్మగ్లర్లపైనే కాకుండా వారికి సహకరించే సిబ్బందిని కూడా గూండా చట్టం కింద అరెస్ట్‌ చేస్తున్నామన్నారు. రేషన్‌ బియ్యం అక్రమ తరలింపు అడ్డుకోవడమే లక్ష్యంగా గస్తీ ముమ్మరం చేశామని, ఇప్పటివరకు బియ్యం అక్రమ తరలింపు వ్యవహారంలో 13,008 కేసులు నమోదుచేసి 13,113 మందిని అరెస్ట్‌ చేసామని తెలిపారు. రాష్ట్రంలో రూ.238 కోట్లతో ధాన్యం నిల్వ చేసేందుకు గోదాములు నిర్మించనున్నామన్నారు. 

Updated Date - 2022-10-03T12:49:47+05:30 IST