మహారాష్ట్రలో సెకండ్‌వేవ్‌

ABN , First Publish Date - 2020-11-28T07:46:33+05:30 IST

కరోనా తొలి దశలో తీవ్రంగా ప్రభావితమైన మహారాష్ట్రలో.. సెకండ్‌ వేవ్‌ మొదలైనట్లే కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలో తాజాగా కేసులు పెరిగాయి. గురువారం దేశంలో 43,082 మందికి వైరస్‌ సోకగా.. ఇందులో అత్యధికం మహారాష్ట్ర(6,406)లోనే నమోదయ్యాయి

మహారాష్ట్రలో సెకండ్‌వేవ్‌

దేశంలో 9 రోజుల తర్వాత 4.5 లక్షలు దాటిన యాక్టివ్‌ కేసులు

ఢిల్లీ, కేరళ రాష్ట్రాలను మించి పాజిటివ్‌లు నమోదు


న్యూఢిల్లీ, నవంబరు 27: కరోనా తొలి దశలో తీవ్రంగా ప్రభావితమైన మహారాష్ట్రలో.. సెకండ్‌ వేవ్‌ మొదలైనట్లే కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలో తాజాగా కేసులు పెరిగాయి. గురువారం దేశంలో 43,082 మందికి వైరస్‌ సోకగా.. ఇందులో అత్యధికం మహారాష్ట్ర(6,406)లోనే నమోదయ్యాయి. రోజువారీ పాజిటివ్‌లలో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో నిలవడం అక్టోబరు 22 తర్వాత ఇదే తొలిసారి. ఢిల్లీ(5,475), కేరళ (5,378) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇప్పటికే రెండో దశ గురించి ప్రజలకు హెచ్చరికలు జారీ చేసిన ప్రభుత్వం.. లాక్‌డౌన్‌ ఆంక్షలను డిసెంబరు 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, కరోనాతో దేశంలో కొత్తగా 4,92 మంది మృతి చెందారు. మరోవైపు 9 రోజుల తర్వాత యాక్టివ్‌ కేసులు 4.5 లక్షలు దాటాయి. ఇందులో అ్యతధిక పెరుగుదల మహారాష్ట్ర(1,526)లోనే కావడం గమనార్హం. యాక్టివ్‌ కేసులు బుధవారం 3 వేలపైగా, గురువారం ఏడు వేల పైగా పెరిగాయి. రోజువారీ రికవరీలు సైతం ఇటీవల తగ్గుతున్నాయి. అయితే, 70 శాతం యాక్టివ్‌ కేసులు మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, రాజస్థాన్‌, యూపీ, కర్ణాటక, బెంగాల్‌, ఛత్తీ్‌సగడ్‌లోనే ఉన్న ట్లు కేంద్రం తెలిపింది. గురువారం 39,379 మంది కోలుకున్నారని వివరించింది. భ క్తులు, పోలీసులు, ఉద్యోగులు సహా శబరిమల ఆలయ సన్నిధానంలో 39 మంది పా జిటివ్‌గా తేలారు. గుజరాత్‌లో ఎన్నడూ లేనంతగా 1,560 కేసులు నమోదయ్యాయి. 

Updated Date - 2020-11-28T07:46:33+05:30 IST