Abn logo
Mar 3 2021 @ 10:02AM

'హరిహర వీరమల్లు' .... ఇద్దరు డైరెక్టర్స్

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ 'వకీల్‌సాబ్‌' సినిమా చిత్రీకరణను పూర్తి చేసిన వెంటనే రెండు సినిమాలను ట్రాక్‌ ఎక్కించేశారు. అందులో డైరెక్టర్‌ క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న 'హరి హర వీరమల్లు' సినిమా ఒకటి. మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబుకి కాలానికి చెందిన కథాంశంతో సినిమా తెరకెక్కుతోంది. తాజా సమాచారం మేరకు ఈ భారీ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి వి.ఎఫ్‌.ఎక్స్‌ వర్క్‌ మీద ఫోకస్‌ చేయాల్సి ఉంది. కాబట్టి మేకర్స్‌ సినిమాను రెండు యూనిట్స్‌గా విభజించారు. అందులో ఓ యూనిట్‌కు డైరెక్టర్‌ క్రిష్ సారథ్యం వహిస్తే.. మరో యూనిట్‌కు బాబు బాగా బిజీ, కమిట్‌మెంట్‌ చిత్రాల దర్శకుడు లక్ష్మీకాంత్‌ చెన్నా సారథ్యం వహిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. సాధారణంగా పెద్ద చిత్రాలకు ఇది కామన్‌గా జరిగే విషయమే కానీ.. బయటకు పెద్దగా చెప్పరు. రాజమౌళి డైరెక్ట్‌ చేసే సినిమాల సెకండ్‌ యూనిట్‌ను ఆయన తనయుడు డైరెక్ట్‌ చేస్తుంటాడు. 

ఇందులో పవన్‌కల్యాణ్‌ పేద ప్రజలకు అండగా నిలిచే బందిపోటు పాత్రలో కనిపిస్తారు. పవన్ కల్యాణ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది డైరెక్టర్ క్రిష్ రూపొందిస్తున్న సినిమా. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్‌తో ఏఎం రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో భారీ ఛార్మినార్ సెట్‌, గండికోట సంస్థానం సెట్ నిర్మించారు. బాలీవుడ్‌ స్టార్‌ అర్జున్‌ రాంపాల్‌ ఇందులో ఔరంగజేబు పాత్రలో కనిపించనున్నాడు. నిధి అగర్వాల్‌, జాక్వలైన్‌ ఫెర్నాండెజ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement