సోమవారం నుంచి పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు

ABN , First Publish Date - 2021-03-07T21:38:27+05:30 IST

పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు రేపు (సోమవారం) ప్రారంభం కానున్నాయి. వివిధ పన్ను ప్రతిపాదనలున్న

సోమవారం నుంచి పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు

న్యూఢిల్లీ: పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు రేపు (సోమవారం) ప్రారంభం కానున్నాయి. వివిధ పన్ను ప్రతిపాదనలున్న ఆర్థిక బిల్లుతోపాటు 2020-21 సంవత్సరానికి గ్రాంట్ల కోసం వివిధ డిమాండ్లు పొందడమే ఈ సెషన్‌లో ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ తప్పనిసరి ఎజెండాలతోపాటు ఈ సెషన్‌లో ఆమోదించడానికి వివిధ బిల్లులను ప్రభుత్వం జాబితా చేసింది. ఇందులో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (సవరణ) బిల్లు, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ బిల్, ఎలక్ట్రిసిటీ (సవరణ) బిల్లు, క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు వంటివి ఉన్నాయి. కాగా, రెండో విడత సమావేశాలు ఏప్రిల్ 8న ముగియనున్నాయి. 


పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం, కేరళ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ పార్టీలు దృష్టి సారించిన వేళ రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగుతుండడం గమనార్హం. మార్చి-ఏప్రిల్ నెలల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీల సీనియర్ నేతలు ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉండడంతో బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టే అవకాశం ఉంది. తొలి విడత బడ్జెట్ సమావేశాలు జనవరి 29న రాష్ట్రపతి ప్రసంగంతో మొదలయ్యాయి.  


Updated Date - 2021-03-07T21:38:27+05:30 IST