మరో పార్లమెంటు ఉద్యోగికి కరోనా వైరస్

ABN , First Publish Date - 2020-05-23T10:31:20+05:30 IST

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని మరో పార్లమెంటు సీనియర్ ఉద్యోగికి కరోనా వైరస్ సోకిన ఘటన కలకలం రేపింది.....

మరో పార్లమెంటు ఉద్యోగికి కరోనా వైరస్

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని మరో పార్లమెంటు సీనియర్ ఉద్యోగికి కరోనా వైరస్ సోకిన ఘటన కలకలం రేపింది. పార్లమెంటు ఎడిటోరియల్, ట్రాన్స్ లేషన్ విభాగంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా సోకడంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రధాన పార్లమెంటు భవనానికి వంద మీటర్ల దూరంలోని పార్లమెంటు భవనం 5వ అంతస్తులో ఉన్న ఉద్యోగికి కరోనా వచ్చింది. గతంలో పార్లమెంటు హౌస్ కీపింగ్ విభాగంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా వచ్చింది. అతనితోపాటు పలువురు ఉద్యోగులను క్వారంటైన్ చేశారు. దీంతో పార్లమెంటు 5వ అంతస్తులోని బ్లాకులకు సీలు వేశారు. లాక్ డౌన్ సమయంలోనూ పార్లమెంటు భవనంలో భౌతిక దూరంతో పాటు నిబంధనలు పాటిస్తూ కొద్దిమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. పార్లమెంటు భవనంలో ఇద్దరు ఉద్యోగులు కరోనా బారిన పడటంతో భవనం మొత్తాన్ని శానిటైజ్ చేయించారు. ఉద్యోగులను హోంక్వారంటైన్ చేశారు. 

Updated Date - 2020-05-23T10:31:20+05:30 IST