ఐర్లాండ్ 212/9
ABN , First Publish Date - 2020-08-02T09:10:23+05:30 IST
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో కర్టిస్ కాంపర్ (68) ఆదుకోవడంతో ఐర్లాండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 212 పరుగులు...
సౌథాంప్టన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో కర్టిస్ కాంపర్ (68) ఆదుకోవడంతో ఐర్లాండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 212 పరుగులు చేసింది. ఇక స్వల్ప లక్ష్యం కోసం బరిలోకి దిగిన ఇంగ్లండ్ కడపటి వార్తలందేసరికి 20 ఓవర్లలో 6వికెట్లకు 143 పరుగులు చేసింది. బెయిర్‌స్టో (82) రాణించాడు. క్రీజులో బిల్లింగ్స్(17) విల్లే(4) ఉన్నారు. అంతకుముందు ఐర్లాండ్ 91 రన్స్‌కే 6 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఈ స్థితిలో ఏడో నెంబర్ బ్యాట్స్‌మన్ కాంపర్.. సిమీ సింగ్ (25)తో ఏడో వికెట్‌కు 60.. మెక్‌బ్రైన్ (24)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 56 రన్స్ జోడించడంతో ఐర్లాండ్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. వన్డేల్లో ఐర్లాండ్ తరఫున అత్యధిక స్కోరు చేసిన ఏడో నెంబర్ బ్యాట్స్‌మన్‌గా కాంపర్ నిలిచాడు.