Abn logo
Jun 3 2020 @ 13:18PM

వలంటీర్‌తో రెండో పెళ్లికి సిద్ధమైన పంచాయతీ సెక్రటరీ

గుంటూరు: దాచేపల్లిలో పంచాయతీ సెక్రటరీ జాన్‌పీరా నిర్వాకం బట్టబయలైంది. భార్య ఉండగానే.. మహిళా వలంటీర్‌తో రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. మాయమాటలు చెప్పి వలంటీర్‌ను బుట్టలో వేసుకున్నాడు. రెండో పెళ్లికి సిద్ధమవ్వడంతో వలంటరీ సోదరుడు అశోక్.. సెక్రటరీని నిలదీశాడు. ప్రశ్నించిన పాపానికి అశోక్‌పై సెక్రటరీ సోదరుడు కత్తితో దాడికి తెగబడ్డాడు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.


సెక్రటరీపై అనేక లైంగిక ఆరోపణలు

పంచాయతీ సెక్రటరీ జాన్‌పీరాకి ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా మహిళా వలంటీర్‌తో రెండో పెళ్లికి రెడీ అయ్యాడు. సెక్రటరీపై పలు లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయి. జాన్‌పీరా లైంగిక వాంఛకు పలువురు మహిళలు బలైనట్లు తెలుస్తోంది. ఆయా పనుల నిమిత్తం వచ్చే మహిళలను మాయమాటలు చెప్పి లోబర్చుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక వైసీపీ నేతగా కూడా జాన్‌పీరా కొనసాగుతున్నాడు. సెక్రటరీపై ఎలాంటి కేసు లేకుండా అధికార పార్టీ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. సెక్రటరీ నిర్వాహకంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. జాన్‌హీరాపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement
Advertisement
Advertisement