రెండో డోసు వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2021-05-12T05:53:02+05:30 IST

శ్రీశైలంలోని మల్లికార్జునసదన్‌లో స్థానిక వైద్యశాఖ అధికారులు, సిబ్బంది మంగళవారం రెండో డోసు టీకా కార్యక్రమాన్ని చేపట్టారు.

రెండో డోసు వ్యాక్సిన్‌

శ్రీశైలం, మే 11: శ్రీశైలంలోని మల్లికార్జునసదన్‌లో స్థానిక వైద్యశాఖ అధికారులు, సిబ్బంది మంగళవారం రెండో డోసు టీకా కార్యక్రమాన్ని చేపట్టారు. కరోన వ్యాక్సిన్‌ మొదటి టీకా వేయించుకున్న వారికి మాత్రమే రెండో డోసు టీకా ఇస్తున్నారు. కార్యనిర్వాహణాధికారి సూచనల మేరకు పోలీసులు, దేవస్థానం భద్రతా సిబ్బంది సమన్వయంతో వ్యాకినేషన్‌ ప్రక్రియలో ఎలాంటి తోపులాటలు లేకుండా ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్‌, భౌతికదూరం పాటించేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.  


బనగానపల్లె: బనగానపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెకండ్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. టంగుటూరు డాక్టర్‌ శివశంకరుడు, పలుకూరు డాక్టర్‌ కృష్ణమూర్తిల పర్యవేక్షణలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిర్వహించారు. మండలానికంతటకీ బనగానపల్లె ప్రభుత్వ డిగ్రీకళాశాలలోనే వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వంద మందికి సెకండ్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ వేసినట్లు డాక్టర్‌ శివశంకరుడు తెలిపారు. 


కొత్తపల్లి: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 31 వరకు రెండో డోసు వ్యాక్సిన్‌ వేస్తున్నట్లు కొత్తపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి వినోద్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం పీహెచ్‌సీలో 94 మందికి రెండో డోసు వ్యాక్సిన్‌ వేశారు. అలాగే గోకవరం పీహెచ్‌సీ పరిధిలోని కొక్కరంచలో 33 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారి జగదీష్‌ చెప్పారు. 


కోవెలకుంట్ల: కోవెలకుంట్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మంగళవారం డాక్టర్‌ బాబు ఆధ్వర్యంలో రెండో  డోసు కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి టాస్క్‌ఫోర్స్‌ మండల కమిటీ సభ్యులు తహసీల్దారు పుష్పకుమారి, ఎంపీడీవో మహబూబ్‌దౌలా, ఈవోపీఆర్డీ ప్రకా్‌షనాయుడు, మార్కెట్‌యార్డు చైర్మన్‌ బీవీ నాగార్జునరెడ్డి, డిప్యూటీ  తహసీల్దారు చంద్రశేఖర్‌  అక్కడికి చేరుకొని వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఎస్‌ఐ చంద్రశేఖర్‌రెడ్డి      పోలీసు సిబ్బందిని నియమించారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు జరిగిన కార్యక్రమంలో 62 మంది సెకండ్‌ డోసు వ్యాక్సిన్‌ వేయించుకున్నారు.     


పాములపాడు: మొదటి డోస్‌ కరోనా వ్యాక్సిన్‌  వేయించుకొన్న ప్రతి వ్యక్తికి రెండో  డోస్‌ వేస్తున్నట్లు మండల వైద్యాధికారి  రోషిణి అన్నారు. మంగళవారం మండలంలో 150 మందికి రెండో  డోస్‌ టీకా వేశామని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మొదట 45 సంవత్సారాలు నిండిన వ్యక్తులకు ఫస్ట్‌ డోస్‌ వేసిన వారికి మాత్రమే సెకెండు డోస్‌ వేస్తున్నామని ఆమె తెలిపారు.  

Updated Date - 2021-05-12T05:53:02+05:30 IST