రేపటి నుంచి రెండో డోసు

ABN , First Publish Date - 2021-05-12T05:13:16+05:30 IST

జిల్లాలో రెండవ డోస్‌ వ్యాక్సినేషన్‌ 13వ తేదీ గురువారం నుంచి జరుగుతుందని జాయింట్‌ కలెక్టర్‌ (అభివృద్ధి) సీఎం సాయికాంత్‌ వర్మ అన్నారు

రేపటి నుంచి రెండో డోసు
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ

వ్యాక్సినేసన్‌ వేసుకొనే వారి వివరాలు ముందుగానే ఇవ్వాలి

జాయింట్‌ కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ


కడప(కలెక్టరేట్‌), మే 11: జిల్లాలో రెండవ డోస్‌ వ్యాక్సినేషన్‌ 13వ తేదీ గురువారం నుంచి జరుగుతుందని జాయింట్‌ కలెక్టర్‌ (అభివృద్ధి) సీఎం సాయికాంత్‌ వర్మ అన్నారు రెండవ డోస్‌ వ్యాక్సినేషన్‌, గృహ నిర్మాణానికి సంబంధించి మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీఓలు, హౌసింగ్‌ అధికారులతో మంగళవారం కలెక్టరేట్‌ నుంచి జాయింట్‌ కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ వేసుకున్న వారికి ప్రాధాన్యత క్రమంలో రెండవ డోస్‌ వ్యాక్సినేషన్‌ జరుగుతుందన్నారు. 45 సంవత్సరాలు దాటి మొదటి డోస్‌ తీసుకొని 4 వారాలు పూర్తి చేసుకొని 6 వారాల్లోపు ఉన్నవారికే రెండో డోసు వ్యాక్సిన్‌ వేస్తారన్నారు. ఇందుకోసం జిల్లాలో 70 వ్యాక్సినేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. తేదీ, సమయం, పేరు, సెల్‌ నెంబరు తదితర వివరాలతో కూడిన స్లిప్పులు ముందురోజే వ్యాక్సినేషన్‌ వేసుకొనే లబ్ధిదారులకు పంపిణీ చేయాలన్నారు. ప్రతి వ్యాక్సినేషన్‌ కేంద్రంలో లబ్ధిదారుల జాబితాను తప్పక డిస్‌ప్లే చేయాలన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఐదు విడతలుగా వ్యాక్సిన్‌ వేస్తారన్నారు. వ్యాక్సిన్‌ కేంద్రాల్లో రద్దీ, తోపులాటలు జరగకుండా చూడాలన్నారు. గృహ నిర్మాణశాఖకు సంబంధించిన సమీక్షలో జిల్లాలో హౌసింగ్‌లో పురోగతిని సాధించాలని, జియో ట్యాగ్‌ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో హౌసింగ్‌ పీడీ రాజశేఖర్‌, డీఈ బాలగంగన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-12T05:13:16+05:30 IST