అల్లకల్లోల్లం.. : ఉక్రెయిన్‌పై రష్యా రెండో రోజూ భీకర యుద్ధం.. (Live Updates)

ABN , First Publish Date - 2022-02-25T17:10:05+05:30 IST

ఉక్రెయిన్‌పై రెండో రోజూ రష్యా భీకర యుద్ధం చేస్తోంది...

అల్లకల్లోల్లం.. : ఉక్రెయిన్‌పై రష్యా రెండో రోజూ భీకర యుద్ధం..  (Live Updates)

కీవ్ : ఉక్రెయిన్‌పై రెండో రోజూ రష్యా భీకర యుద్ధం చేస్తోంది. ఉక్రెయిన్‌ రాజధాని నగరం కీవ్ సహా ప్రధాన నగరాలపై  గురువారం ఉదయం ప్రారంభమైన భీకర దాడుల్లో ఇప్పటి వరకు దాదాపు 137 మంది ఉక్రెయినియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. భూ, ఆకాశ, సముద్ర మార్గాల్లో ఈ దాడులు జరుగుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరోపులో ఏర్పడిన భారీ సంక్షోభాల్లో ఇదొకటి. నిన్నటి నుంచీ రష్యా భీకర యుద్ధంతో ఉక్రెయిన్ చిగురుటాకులా వణికిపోతోంది. యుద్ధం విషయంలో వెనక్కి తగ్గేదే లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఛాలెంజ్ చేసి మరీ చెబుతుండగా.. ఉక్రెయిన్‌ను ఒంటరిగా వదిలేశారని.. ప్రపంచం పట్టించుకోవట్లేదని అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


కాగా.. రష్యా జరుపుతున్న దాడుల్లో జరుగుతున్న విద్వంసాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో చూసిన ప్రపంచం తల్లడిల్లిపోతోంది. ప్రపంచ దేశాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తూ, సంయమనం పాటించాలని రష్యాను కోరుతున్నారు. కీవ్‌లో యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ రష్యాలోని సుమారు 51 నగరాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించిన దాదాపు 1,700 మంది రష్యన్లను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం సెంట్రల్ కీవ్‌లో రెండు భారీ పేలుళ్ళు వినిపించాయి. రష్యన్ సేనలు కీవ్‌ను సమీపిస్తున్నాయి. అయితే ఉక్రెయిన్ సైన్యం ఫేస్‌బుక్ పేజీలో తెలిపిన వివరాల ప్రకారం, కీవ్‌లో సాధారణ ప్రజలు నివసించే ప్రాంతాలపై రష్యా దాడులు చేస్తోంది. రష్యాకు రెండు భయానక బహుమతులను ఇచ్చామని ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ తెలిపింది.


ఈ యుద్ధానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్‌ను ఈ కింద ఉన్న లింక్స్‌పై క్లిక్ చేసి చూడగలరు..


కీవ్ సమీపంలోని ఏరోడ్రోమ్‌ను స్వాధీనం చేసుకున్న రష్యా(08:07pm)

----------

చర్చలకు సిద్ధం: రష్యా సంచలన నిర్ణయం(07:29pm)

-----------

ఉక్రెయిన్ అధ్యక్షుడికి రష్యాలో వేల మంది ఫ్యాన్స్!(06:43PM)

-----------

ఉక్రెయిన్‌ నుంచి తప్పించుకునే యత్నం.. పోలండ్ సరిహద్దు వైపుగా భారతీయ విద్యార్థుల నడక(06:39PM)

----------

ఉక్రెయిన్‌లోని భారతీయుల కోసం రెండు విమానాలు.. మొత్తం ఖర్చులు భరిస్తామన్న ప్రభుత్వం(05:56PM)

----------

రష్యాను అడ్డుకోవడంలో నాటో ఫెయిల్: టర్కీ అధ్యక్షుడు(05:51PM)

-----------

మిలిటరీ దుస్తుల్లో ఉక్రెయిన్ అధినేత.. ప్రశంసల జల్లు(05:22PM)

---------

యుద్ధ ప్రభావం.. చెర్నోబిల్‌లో పెరిగిన అణుధార్మికత(04:54PM)

----------

ఆ పని చేస్తే కనుక ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమే: రష్యా కీలక వ్యాఖ్యలు(04:52pm)

----------

మొదటిరోజు దాడిలో రష్యా ఫెయిల్: బ్రిటన్(04:47pm)

-----------

ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వలస వెళ్తున్న ఉక్రెయిన్ దేశస్తులు(04:30pm)

------------

ఉక్రెయిన్ అణుబాంబుల్ని ప్రయోగించేందుకు సిద్ధపడుతోందా?(03:54pm)

--------

ఉక్రెయిన్- రష్యా యుద్ధం: మోదీ కీలక నిర్ణయం(03:29pm)

--------

రష్యా చర్య.. బ్రిక్స్ తీర్మానానికి విరుద్ధం(03:19pm)

--------

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల్ని తీసుకొచ్చేందుకు రూట్ మ్యాప్‌ సిద్ధం(02:33pm)

---------

సెయింట్ వ్లదిమిర్ అయ్యేందుకే పుతిన్ యుద్ధమా?(02:29PM)

---------

ఉక్రెయిన్‌లో కృష్ణాజిల్లాకు చెందిన విద్యార్థుల ఇబ్బందులు...(02:11PM)

---------

తెలంగాణ విద్యార్థుల కోసం 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు: గౌరవ్ ఉప్పల్(02:08PM)

---------

రాజధాని విడిచి పారిపోయినట్లు వస్తున్న వార్తలను ఖండించిన జెలన్‌స్కీ(01:46PM)

-----------

కీవ్‌లో ప్రవేశించిన రష్యన్ దళాలు : ఉక్రెయిన్ అధ్యక్షుడు(01:43PM)

--------

ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ కీలక ప్రకటన(01:42PM)

----------

రష్యాతో సంబంధాలు పూర్తిగా తెంచుకుంటాం: బైడెన్ హెచ్చరిక(01:30PM)

----------

భారత్ రాజకీయ, వైద్య సాయం చేయాలి : ఉక్రెయిన్ ఎంపీ (01:06PM)

--------

కీవ్ సమీపంలో రష్యా దాడులు తీవ్రతరం (12:47PM)

--------

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులకు శుభవార్త (12:07PM)




--------

భారీ లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (11:24AM)

--------

గర్జిస్తున్న రష్యా.. నిలువెల్లా వణికిపోతోన్న ఉక్రెయిన్..(11:11AM)

--------

ఉక్రెయిన్‌ నుంచి భారతీయులను వేగంగా రప్పించాలంటూ పిల్ (10:50AM)

--------

ఉక్రెయిన్‌లో తమిళుల రక్షణకు ప్రభుత్వం చర్యలు (10:21AM)


--------

ఒంటరిగా వదిలేశారు : ఉక్రెయిన్ అధ్యక్షుడి ఆవేదన (09:57AM)


--------

హృదయ విదారక దృశ్యం.. వైరల్ వీడియో! (09:34AM)


--------

రష్యాపై అమెరికా, బ్రిటన్ కఠిన ఆంక్షలు (09:33AM)


--------

రష్యా చేతికి చెర్నోబిల్ అణు విద్యుత్ ప్లాంట్‌ (09:23AM)


--------

ఉక్రెయిన్‌పై మోదీకి వివరించిన పుతిన్‌ (09:04AM)

--------

భారత్‌కు పెనుసవాలే! (03:34AM)

--------

అమెరికా ప్రత్యక్ష యుద్ధానికి దిగదు (03:32AM)

--------

మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా? (03:27AM)

--------

ఏయ్‌ బిడ్డా.. ఇది నా అడ్డా (03:23AM)

--------

ఏం టైమింగ్‌లో వచ్చాను?: ఇమ్రాన్‌ (03:17AM)

--------




బిక్కుబిక్కు.. బంకర్లే దిక్కు! (03:15AM)

--------


రష్యా యుద్ధోన్మాదం! (02:36AM)

--------


రష్యాపై ఆంక్షల వేటు (02:18AM)


-----------------------



ఉక్రెయిన్‌‌పై రష్యా మొదటి రోజు యుద్ధానికి సంబంధించి వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి..

-----------------------

Updated Date - 2022-02-25T17:10:05+05:30 IST