వైభవంగా రెండవ రోజు వడాయితీ ఉత్సవం

ABN , First Publish Date - 2021-06-14T04:44:41+05:30 IST

వడాయితీ ఉత్సవం సందర్భంగా ఊయలలో ఊగుతున్న గంగా, కామాక్షితాయి సమేత మల్లికార్జునస్వామి

వైభవంగా రెండవ రోజు వడాయితీ ఉత్సవం

బుచ్చిరెడ్డిపాళెం, మే 13: మండలంలోని జొన్నవాడ ఆలయంలో గంగా, కామాక్షితాయి సమేత శ్రీమల్లికార్జునస్వామికి ఆదివారం రెండవ రోజు వడాయితీ ఉత్సవం వైభవంగా జరిగింది.  బ్రహ్మోత్సవాల తర్వాత జరిగే ఈ ఉత్సవాల్లో స్వామి, అమ్మవార్లకు కుంభహారతి సందర్భంగా మండపంలో ముందుగా పూజలు నిర్వహించి అనంతరం ఊయల సేవ నిర్వహించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా నిర్వహించిన ఈ వడాయితీ ఉత్సవాలను ఆలయ చైర్మన్‌  చీమల రమేష్‌బాబు, ఈవో ఏవీ. శ్రీనివాసులురెడ్డి,  కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. 

Updated Date - 2021-06-14T04:44:41+05:30 IST