రెండోరోజూ అదే హోరు!

ABN , First Publish Date - 2022-01-29T07:02:28+05:30 IST

రివర్స్‌ పీఆర్సీని వ్యతిరేకిస్తూ పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో కాకినాడ ధర్నా చౌక్‌లో రిలే నిరాహార దీక్షలు శుక్రవారం రెండో రోజుకు చేరుకున్నాయి.

రెండోరోజూ అదే హోరు!
ధర్నా చౌక్‌ వద్ద ఏర్పాటుచేసిన దీక్షా శిబిరం వద్ద మాట్లాడుతున్న ఎస్‌టీయూ నాయకుడు

  • దీక్షలో పాల్గొన్న 400 మందికి పైగా ఉద్యోగులు
  • పాత జీతాలే ఇవ్వాలని డిమాండ్‌

భానుగుడి (కాకినాడ), జనవరి 28: రివర్స్‌ పీఆర్సీని వ్యతిరేకిస్తూ పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో కాకినాడ ధర్నా చౌక్‌లో రిలే నిరాహార దీక్షలు శుక్రవారం రెండో రోజుకు చేరుకున్నాయి. సుమారు 400 మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారు. ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్‌ గుద్దాటి రామ్మోహన్‌రావు, ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్‌ పితాని త్రినాథ్‌, గెజిటెడ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్‌, గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ జగన్నాథం, ఏపీ ఎన్జీవో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాసు, కార్యదర్శి పాలపర్తి మూర్తిబాబు దీక్షా శిబిరాన్ని ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ వచ్చేనెల 5న ‘చలో విజయవాడ’ను విజయవంతం చేయడానికి ఉద్యోగు లంతా సిద్ధంగా ఉన్నారన్నారు. అర్ధరాత్రి ఇచ్చిన జీవోలను తక్షణం రద్దు చేయాలని నినాదాలు చేశారు. మెరుగైన పీఆర్సీ జీవోలను విడుదల చేసి ఉద్యోగులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. అధికారంలోకి రాక ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీలో భాగంగా సీపీఎస్‌ విధానాన్ని తక్షణం రద్దు చేయాలన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలన్నారు. సచివాల య ఉద్యోగులను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేసి నూతన పేస్కేల్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంసాని శ్రీనివాసరావు, పీఈటీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లంక జార్జ్‌, సీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రవి ఎస్టీ యూ రాష్ట్ర కోశాధికారి సుబ్బరాజు, యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు టి.చక్రవర్తి, ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణం, ఫ్యాప్టో జిల్లా చైర్మన్‌ చేకూరి రవి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు తిలక్‌బాబు, బహుజన్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు శరత్‌, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సత్తిబాబు, పాము శ్రీను, రమేష్‌, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సత్తి బాబు, విజువల్లీ చాలెంజ్డె ఎంప్లాయీస్‌ సంఘ అధ్యక్షులు సుబ్బారావు, ఎన్జీవో సంఘం నేతలు వెంకటరమణ, చంద్రరావు, నారాయణ పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-29T07:02:28+05:30 IST