రెండో రోజు ఇంటర్‌ పరీక్ష ప్రశాంతం

ABN , First Publish Date - 2021-10-27T05:32:31+05:30 IST

ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం రెండో రోజు ఇంగ్లిష్‌ పేపర్‌-1 పరీక్ష జిల్లా వ్యాప్తంగా మంగళవారం ప్రశాంతంగా జరిగింది. జిల్లావ్యాప్తంగా 71 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 18,697 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 17,500ల మంది హాజరయ్యారు. 1,197 మంది గైర్హాజరయ్యారు.

రెండో రోజు ఇంటర్‌ పరీక్ష ప్రశాంతం
పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న కలెక్టర్‌

నిజామాబాద్‌అర్బన్‌, అక్టోబరు 26: ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం రెండో రోజు ఇంగ్లిష్‌ పేపర్‌-1 పరీక్ష జిల్లా వ్యాప్తంగా మంగళవారం ప్రశాంతంగా జరిగింది. జిల్లావ్యాప్తంగా 71 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 18,697 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 17,500ల మంది హాజరయ్యారు. 1,197 మంది గైర్హాజరయ్యారు. ఇందులో రెగ్యులర్‌ విద్యార్థులు 16,484 మందికిగాను.. 938 మంది గైర్హాజరు కాగా.. 15,546 మంది పరీక్ష రాశారు. ఒకేషనల్‌ విద్యార్థుల్లో 2,213 మందికిగాను.. 1,954 మంది హాజరు కాగా.. 259 మంది గైర్హాజరయ్యారు. డీఐఈవో రఘురాజ్‌ ఐదు పరీక్ష కేంద్రాలను, హైపవర్‌ కమిటీ ఆరు పరీక్ష కేంద్రాలను, డీఈసీ ఆరు పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. 

పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్‌

ఇంటర్మీడియట్‌ పరీక్ష కేంద్రాలను మంగళవారం కలెక్టర్‌ నారాయణరెడ్డి తనిఖీ చేశారు. నగరంలోని కంఠేశ్వర్‌లో గల ఉమెన్స్‌ కళాశాల, గంగాస్థాన్‌లోని ఎస్‌ఆర్‌ జూనియర్‌ కళాశాలలో పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు థర్మల్‌ స్ర్కీనింగ్‌తో ఉష్ణోగ్రత పరిశీలించి పంపాలని ఆదేశించారు. భౌతికదూరం పాటిస్తూ సానిటైజర్‌, మాస్కులు వాడేలా చూడాలని, విద్యార్థులకు తాగునీరు, మెడికల్‌ కిట్‌లు అందుబాటులో ఉంచాలన్నారు. 

Updated Date - 2021-10-27T05:32:31+05:30 IST