సెకెండ్‌ ఏఎన్‌ఎంలను రెగ్యులరైజ్‌ చేయాలి

ABN , First Publish Date - 2022-05-28T05:13:36+05:30 IST

కాంటాక్టు పద్ధతిలో గత 14ఏళ్లుగా పని చేస్తు న్న సెకెండ్‌ ఏఎన్‌ఎంలను వెంటనే రెగ్యులరైజ్‌ చేయాలని ఏఎన్‌ఎంల సంఘం నేతలు డిమాండ్‌ చేశారు.

సెకెండ్‌ ఏఎన్‌ఎంలను రెగ్యులరైజ్‌ చేయాలి
ఎమ్మెల్యే చింతలకు వినతి పత్రం ఇస్తున్న సెకెండ్‌ ఏఎన్‌ఎంలు

వాల్మీకిపురం, మే 27: కాంటాక్టు పద్ధతిలో గత 14ఏళ్లుగా  పని చేస్తు న్న సెకెండ్‌ ఏఎన్‌ఎంలను వెంటనే రెగ్యులరైజ్‌ చేయాలని ఏఎన్‌ఎంల సంఘం నేతలు డిమాండ్‌ చేశారు. శుక్రవారం వాల్మీకిపురంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని కలిసి ఆ మేరకు వినతిపత్రం అందజేశారు. 2008లో జిల్లా సెలెక్షన్‌ కమిటీ ద్వారా ఎంపికైన సెకెండ్‌ ఏఎన్‌ఎంలకు ఉద్యోగ భద్రత లేదని వెట్టిచాకిరి చేస్తున్నా ప్రభుత్వం ద్వారా తమకు న్యాయం జరగలేదని విచారం వ్యక్తం  చేశారు. జీతాలు పెంచి తమను తక్షణం రెగ్యులరైజ్‌ చేయాలన్నారు.  స్పందించిన ఎమ్మెల్యే చింతల మాట్లాడుతూ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తప్పక పరిష్కరించేలా చూస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎంల అసోసి యేషన్‌ సభ్యులు వరలక్ష్మీ, గంగులమ్మ, రుక్మిణమ్మ, విమల, నాగరాజమ్మ, లీలా వతి, అరుణ, విజయ, జ్యోత్న్స, రాధమ్మ, జ్యోతి, కళ్యాణి, రెడ్డిసులోచన పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-28T05:13:36+05:30 IST