ముగిసిన డెడ్ లైన్.. ఎస్ఈసీ తదుపరి చర్యలపై సర్వత్రా ఆసక్తి

ABN , First Publish Date - 2021-01-23T22:46:45+05:30 IST

ఏపీ అధికారులకు రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పెట్టిన వీడియో కాన్ఫరెన్స్ డెడ్ లైన్ ముగిసింది.

ముగిసిన డెడ్ లైన్.. ఎస్ఈసీ తదుపరి చర్యలపై సర్వత్రా ఆసక్తి

అమరావతి: ఏపీ అధికారులకు రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పెట్టిన వీడియో కాన్ఫరెన్స్ డెడ్ లైన్ ముగిసింది. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా కలెక్టర్లు, అధికారులు ఎవరూ హాజరుకాలేదు. దీంతో నిమ్మగడ్డ సాయంత్రం 5 గంటల వరకు డెడ్ లైన్ పెట్టారు. ఆయన ఎదురు చూపులకు ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు ఆయన ఎలాంటి చర్య తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజా పరిణామాలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ సోమవారం గవర్నర్‌ను కలిసే అవకాశం ఉంది. అయితే గవర్నర్ అపాయింట్‌మెంట్‌పై ఇంకా స్పష్టత రాలేదు. అధికారుల గైర్హాజరుపై కోర్టు, గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎస్ఈసీ వర్సెస్ ఏపీ సర్కార్ వార్ సోమవారం వరకు కొనసాగే అవకాశం కనపడుతోంది.

Updated Date - 2021-01-23T22:46:45+05:30 IST