ఉద్యోగులతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ భేటీ

ABN , First Publish Date - 2021-01-21T21:56:48+05:30 IST

ఎస్ఈసీ కార్యాలయంలో ఉద్యోగులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ భేటీ అయ్యారు. అధికారులతో సమావేశం ఏర్పాటుకు

ఉద్యోగులతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ భేటీ

అమరావతి: ఎస్ఈసీ కార్యాలయంలో ఉద్యోగులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ భేటీ అయ్యారు. అధికారులతో సమావేశం ఏర్పాటుకు నిమ్మగడ్డ తేదీలను ఖరారు చేయనున్నారు. రెండ్రోజుల్లో సీఎస్, డీజీపీ, వివిధ శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంపై సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు  నిమ్మగడ్డ లేఖ రాయనున్నారు.


స్థానిక ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్..

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. పంచాయతీ ఎన్నికలు కొనసాగించాలని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్నికలపై స్టే విధిస్తూ సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును కొట్టివేయడం జరిగింది. ఎస్‌ఈసీ దాఖలు చేసిన రిట్‌ అప్పీల్‌ను హైకోర్టు అనుమతించింది. ఈ సందర్భంగా ప్రజారోగ్యం, ఎన్నికలు రెండూ ముఖ్యమేనని.. ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమన్వయంతో ముందుకు సాగాలని హైకోర్టు సూచించింది. కాగా.. ఈనెల 8న ఎన్నికల షెడ్యూల్‌ను ఎస్ఈసీ ప్రకటించింది.


కాగా.. ఈనెల 8న ఎన్నికల షెడ్యూల్‌ను ఎస్ఈసీ ప్రకటించింది. 11న ఎస్ఈసీ ఆదేశాలను హైకోర్టు సింగిల్ జడ్జి కొట్టేయగా.. ఈ ఆదేశాలపై ఎస్ఈసీ అప్పీల్‌కు వెళ్లింది. మూడ్రోజుల పాటు ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించాలని ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ తీర్పును బీజేపీ నేతలు స్వాగతించారు. పంచాయతి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం శుభ పరిణామం అంటున్నారు.

Updated Date - 2021-01-21T21:56:48+05:30 IST