AP News: ఎస్‌ఈసీ, హైకోర్టులపై వెంకట్రామరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-08-19T22:32:28+05:30 IST

ఎస్‌ఈసీ, హైకోర్టు (SEC High Court)లపై ఏపీ గ్రామ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి (Venkatrama Reddy) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

AP News: ఎస్‌ఈసీ, హైకోర్టులపై వెంకట్రామరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాద్: ఎస్‌ఈసీ, హైకోర్టు (SEC High Court)లపై ఏపీ గ్రామ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి (Venkatrama Reddy) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎస్‌ఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టిందని, ఇటీవలే కోర్టులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాయని విమర్శించారు. హైకోర్టులో కొందరు జడ్జీలు ప్రభుత్వాన్ని ఇబ్బందిపెడుతున్నారని, హైకోర్టు వ్యవహారశైలిపై న్యాయనిపుణులే విమర్శలు చేశారని తెలిపారు. హైకోర్టు జడ్జిలను తిడితే 3 నెలలైనా బెయిల్ రాలేదని, సీఎం జగన్‌ (CM Jagan) ను గతంలో ఒకరు తిడితే గంటలోనే బెయిల్ ఇచ్చారని గుర్తుచేశారు. జడ్జిలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడకుండా డిగ్నిఫైడ్‌గా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులపై ఉందని వెంకట్రామిరెడ్డి చెప్పారు.

Updated Date - 2022-08-19T22:32:28+05:30 IST