మూకుమ్మడిగా.. డుమ్మా..!

ABN , First Publish Date - 2021-01-24T06:04:56+05:30 IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వీడియో కాన్ఫరెన్స్‌కి జిల్లా అధికారులు మూకు మ్మడిగా గైర్హాజరయ్యారు.

మూకుమ్మడిగా.. డుమ్మా..!
ఖాళీగా ఉన్న వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌

ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌కి జిల్లా అధికారులు గైర్హాజరు

సమావేశ మందిరం వైపు కన్నెత్తి చూడని అధికారులు

ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయిన జడ్పీ సీఈవో, డీపీవో

ఎవరిపై వేటు పడుతుందో..?


పంచాయతీ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెల కొంది. శనివారం ఉదయం ఎస్‌ఈసీ ఎన్నికల నోటిఫికేషన్‌న విడుదల చేసింది. మధ్యాహ్నం మూడు గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరు కావాలని ముందస్తు సమాచారం ఇచ్చారు. కానీ ఎస్‌ఈసీ వీడియో కాన్షరెన్స్‌కు జిల్లా అధికారులు గైర్హాజరయ్యారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగా ఎస్‌ఈఈసీ వీడియో కాన్ఫరెన్స్‌కి అధికారుల గైర్హాజరు ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుంది. దీంతో సంబంధిత అధికారులపై ఎస్‌ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకొంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. 


గుంటూరు, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వీడియో కాన్ఫరెన్స్‌కి జిల్లా అధికారులు మూకు మ్మడిగా గైర్హాజరయ్యారు. శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు అధికారులంతా హాజరు కావాలని ఎస్‌ఈసీ నిమ్మ గడ్డ రమేష్‌కుమార్‌ ముందస్తుగానే సమాచారం ఇచ్చినప్పటికీ కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్లు ఎవరూ సమావేశ మందిరానికి రాలేదు. మిగతా సిబ్బంది కూడా ఆ దరిదాపులకు రాలేదు. జిల్లాపరిషత్తు సీఈవో, జిల్లా పంచాయతీ అధికారి మాత్రమే అలా వచ్చి రెండు నిమిషాలు ఉండి వెళ్లిపోయారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగా ఎస్‌ఈఈసీ వీడియో కాన్ఫరెన్స్‌కి అధికారుల గైర్హాజరు ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిం దకే వస్తుంది. దీంతో సంబంధిత అధికారులపై ఎస్‌ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకొంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. 

గత ఏడాది స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అక్ర మాలు జరగడంతో అప్పట్లోనే ఎస్‌ఈసీ కన్నెర్ర చేసి కలెక్టర్‌ ఇందుపల్లి శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ని తొలగించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ ఆదేశాలను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. అలానే కలెక్టర్‌ని కొనసాగిస్తూ వచ్చింది. పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు నుంచి ఆమోదం లభించడంతో శుక్రవారమే కలెక్టర్‌ని తొలగించి ఆయన స్థానంలో ముగ్గురి పేర్లను సిఫార్సు చేయాలని ఎస్‌ఈసీ ప్రభు త్వానికి ఆదేశించింది. అంతేకాకుండా కలెక్టర్‌ విధుల నుంచి రిలీ వింగ్‌ అయి జాయింట్‌ కలెక్టర్‌కు ఛార్జ్‌ ఇవ్వాలని ఆజ్ఞాపించింది. అయితే ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.  కాగా శనివారం ఉదయం తొలివిడత పంచాయతీ ఎన్నికలకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జిల్లాలో తొలి విడతలో గుంటూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని అన్ని మండలాల్లోని పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతాయని పేర్కొంది. ఎన్నికల సన్నద్ధత గురించి సమీక్షించేందుకు మధ్యాహ్నం 3 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేసినట్లు సమాచారం పంపించింది. ఈ సమాచారం ఎస్‌ఈసీ నుంచి జిల్లా యంత్రాంగానికి అందింది. అయితే ఏ ఒక్క అధికారి మీటింగ్‌కు రాకపోవడం ఎస్‌ఈసీని ఆగ్ర హానికి గురిచేస్తోంది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగా ఎస్‌ఈసీ సుప్రీంగా ఉంటుంది. గతంలో చీఫ్‌ సెక్రటరీలు, డీజీపీలను కేంద్ర ఎన్నికల సంఘం తొలగించిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సమావేశానికి హాజరు కాని అధికారులపై ఎస్‌ఈసీ ఎలాంటి చర్యలు చేపడుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.  ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ మేరకు నోటి ఫైచేసిన కేంద్రాల్లో సోమ వారం గుంటూరు డివిజన్‌లోని 268 పంచాయతీలలో సర్పంచ్‌, వార్డుమెంబర్ల తొలిదశలో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమ వుతుంది. 365 కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణ జరగనుంది. రాజధాని అమరావతి ప్రాంతంలో తుళ్ళూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో పూర్తిగా పంచాయతీ ఎన్నికలను నిలిపివేశారు. అదేవిధంగా గుంటూరు రూరల్‌ మండలంలో కొన్ని గ్రామాలను నగరపాలక సంస్థలో చేర్చారు. దీంతో ఇక్కడ కూడా ఎన్నికలు లేవు. తెనాలి డివిజన్‌లో బాపట్ల, పొన్నూరు మండలాలు, నరస రావుపేట మండలంలోని కొన్నిగ్రామాలు, గురజాల, దాచేపల్లిలో ఎన్నికలు లేవు.    

Updated Date - 2021-01-24T06:04:56+05:30 IST