SEBI పరిశీలనలో కొత్త కాన్సెప్ట్...

ABN , First Publish Date - 2022-06-10T02:19:38+05:30 IST

బ్రోకర్లు, వారితో అనుసంధానితమై ఉండే పెట్టుబడిదారుల ప్రయోజనాల దృష్ట్యా మార్కెట్ల నియంత్రణ సంస్థ(SEBI) కొత్త కాన్సెప్ట్‌ను పరిశీలిస్తోంది.

SEBI పరిశీలనలో కొత్త కాన్సెప్ట్...

ముంబై : బ్రోకర్లు, వారితో అనుసంధానితమై ఉండే పెట్టుబడిదారుల ప్రయోజనాల దృష్ట్యా మార్కెట్ల నియంత్రణ సంస్థ(SEBI) కొత్త కాన్సెప్ట్‌ను పరిశీలిస్తోంది. కార్వీ స్టాక్ బ్రోకింగ్స్ వైఫల్యం తరువాత... బ్రోకర్లు, పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడేందుకు సెబీ కొత్త చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో... బ్రోకర్ల కోసం మూలధన నిర్మాణం, రిస్క్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి కఠినమైన నిబంధనలను తీసుకురావచ్చునని సమాచారం.


అలాగే... సాంకేతికపరమైన అంశాలపై అదనపు చర్యలు ఉండవచ్చని కూడా వినవస్తోంది. ఏదేమైనప్పటికీ వ్యవస్థాత్మకంగా ముఖ్యమైన ట్యాగ్ కోసం ప్రమాణాలను నిర్ణయించడానికి చర్చించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు ఈ సందర్భంగా వినవస్తున్నాయి. కాగా...  మార్కెట్ నిపుణులు, బ్రోకింగ్ వ్యాపార అనుభవజ్ఞులు చెబుతున్న ప్రకారం... టర్నోవర్, AUM తదితర అంశాల పరంగా వ్యాపార పరిమాణం తదితర కొలమానాలు ఉండవచ్చని చెబుతున్నారు.


ఈ ఏడాది మార్చి నాటికి అందుబాటులో ఉన్న పబ్లిక్ డేటా ప్రకారం... దాదాపు 64 లక్షల యాక్టివ్ క్లయింట్‌లతో జెరోధా అగ్రస్థానంలో ఉంది, అప్‌స్టాక్స్‌లో 58 లక్షలు, గ్రోవ్‌లో 40 లక్షలు, ఏంజెల్ వన్ దగ్గర దాదాపు 37 లక్షల మంది యాక్టివ్ క్లయింట్లు ఉన్నారు. ICICI సెక్యూరిటీస్ 30 లక్షలు, కోటక్ సెక్యూరిటీస్ 13 లక్షలు, HDFC సెక్యూరిటీస్ 11.5 లక్షలు, IIFL సెక్యూరిటీస్ 11.5 లక్షల యాక్టివ్ క్లయింట్లతో ఉన్నాయి. కాగా... కొత్త కాన్సెప్ట్ విషయమూ వాటాదారులు సహా ఆయా వర్గాలతో SEBI చర్చించే అవకాశాలున్నట్లు వినవస్తోంది. 

Updated Date - 2022-06-10T02:19:38+05:30 IST