కిమ్స్‌ ఐపీఓకు సెబీ ఓకే

ABN , First Publish Date - 2021-05-04T06:40:15+05:30 IST

కృష్ణ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌స (కిమ్స్‌) తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ) ప్రతిపాదనకు క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మం డలి ‘సెబీ’ ఆమోదం తెలిపింది...

కిమ్స్‌ ఐపీఓకు సెబీ ఓకే

  • రూ.700 కోట్ల సమీకరణ లక్ష్యం!

న్యూఢిల్లీ: కృష్ణ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌స (కిమ్స్‌) తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ) ప్రతిపాదనకు క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మం డలి ‘సెబీ’ ఆమోదం తెలిపింది. ఈ ఐపీఓ ద్వారా కిమ్స్‌ రూ.700 కోట్ల వరకు సమీకరించే అవకాశం ఉంది. పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా రూ.200 కోట్ల వరకకు కొత్త ఈక్విటీలను కిమ్స్‌ జారీ చేయనుంది. ప్రమోటర్లు, ఇతర వాటాదారులు కలిసి మరో 2,13,40,931 షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎస్‌) పద్ధతిన విక్రయించనున్నారు. ఐపీఓలో కొనుగోలు చేసేందుకు వీలుగా కంపెనీ అర్హులైన ఉద్యోగులకు కొన్ని షేర్లను రిజర్వ్‌ చేయనుంది. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా సేకరించిన నిధులను కిమ్స్‌ తన, అనుబంధ విభాగాల రుణాలను తిరిగి చెల్లించేందుకు ఉపయోగించనుంది. పబ్లిక్‌ ఇష్యూ తర్వాత కంపెనీ తన షేర్లను బీఎస్‌ఈ, ఎన్‌ఎ్‌సఈలో లిస్ట్‌ చేయనుంది.  

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కిమ్స్‌.. తెలుగు రాష్ట్రాల్లోని అతిపెద్ద కార్పొరేట్‌ హాస్పిటల్‌ నిర్వహణ కంపెనీల్లో ఒకటి. కిమ్స్‌ హాస్పిటల్స్‌ బ్రాండ్‌ నేమ్‌తో కంపె నీ 9 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నడుపుతోంది. 2020 డిసెంబరు 31 నాటికి ఈ హాస్పిటళ్లు మొత్తం 3,064 పడకల సామర్థ్యం కలిగి ఉన్నాయి. కార్డియాక్‌ సైన్సెస్‌, ఆంకాలజీ, న్యూరోసైన్సెస్‌, గ్యాస్ట్రిక్‌ సైన్సెస్‌, ఆర్థోపెడిక్‌, అవయవాల మార్పిడి, రెనల్‌ సైన్సెస్‌, మదర్‌ అండ్‌ చైల్డ్‌ కేర్‌ సహా 25కు పైగా స్పెషాలిటీస్‌, సూపర్‌ స్పెషాలిటీస్‌ సేవలందిస్తోంది. 


ఆరంభ నష్టాల నుంచి రికవరీ: స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు ప్రారంభంలో నమోదైన భారీ నష్టాల నుంచి తేరుకోగలిగాయి. సోమవారం ట్రేడింగ్‌ ఆరంభంలోనే బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 750 పాయింట్లకు పైగా పతనమైంది. క్రమంగా కోలుకుని చివర్లో 63.84 పాయింట్ల నష్టంతో 48,718.50 వద్ద ముగిసింది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 3.05 పాయింట్ల లాభంతో 14,634.15 వద్ద స్థిరపడింది. మార్కెట్‌ దిగ్గజ షేరు రిలయన్స్‌ ఇండస్ట్రీ్‌సతో పాటు బ్యాంకింగ్‌ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి భారీ నష్టాలకు కారణమైంది.  



నెల గరిష్ఠానికి రూపాయి : దేశీయ కరెన్సీ దాదాపు నెల రోజుల గరిష్ఠ స్థాయికి పుంజుకుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ మరో 14 పైసలు బలపడింది. దాంతో ఎక్స్ఛేంజ్‌ రేటు రూ.73.95కు పరిమితమైంది. అంతర్జాతీయంగా డాలర్‌ బలహీనపడటంతోపాటు ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, దేశీయ స్థూల ఆర్థికాంశాల్లో సానుకూలత మన రూపాయికి మద్దతుగా నిలిచాయి. 

పసిడి..పైకి: దేశీయంగా విలువైన లోహాల ధరలు పెరిగాయి. ఢిల్లీ మార్కెట్లో మేలిమి (24 క్యారెట్లు) బంగారం పది గ్రాములకు రూ.310 పెరిగి రూ.46,580కి చేరుకుంది. కిలో వెండి రూ.580 ఎగబాకి రూ.67,429 ధర పలికింది. అంతర్జాతీయంగా బులియన్‌ ధరలు పెరగడం ఇందుకు ప్రధాన కారణం. ఇంటర్నేషనల్‌ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం ఒక దశలో 1,777 డాలర్లు, సిల్వర్‌ 26.06 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. 



ఇండియా పెస్టిసైడ్స్‌కూ గ్రీన్‌సిగ్నల్‌ 

పంట రసాయనాల సాంకేతిక కంపెనీ ఇండియా పెస్టిసైడ్స్‌ ఐపీఓకూ సెబీ ఆమో దం లభించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ సంస్థ.. ఐపీఓ ద్వారా రూ.800 కోట్ల వరకు సమీకరించాలనుకుంటోంది. 


కెమ్‌ప్లాస్ట్‌ రూ.3,500 కోట్ల ఐపీఓ 

చెన్నైకి చెందిన ప్రత్యేక రసాయనాల తయారీ సంస్థ కెమ్‌ప్లాస్ట్‌ సన్మార్‌ లిమిటెడ్‌ ఐపీఓకు రాబోతోంది. క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి ‘సెబీ’కి సోమవారం పత్రాలు కూడా సమర్పించింది. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా మొత్తం రూ.3,500 కోట్లు సేకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుం ది. అందులో రూ.2,000 కోట్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) ద్వారా, మరో రూ.1,500 కోట్లు తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా సమీకరించాలనుకుంటోంది. 




Updated Date - 2021-05-04T06:40:15+05:30 IST