Advertisement
Advertisement
Abn logo
Advertisement

సత్తెనపల్లిలో సెబ్ సోదాలు

గుంటూరు: జిల్లాలోని సత్తెనపల్లిలో నర్సయ్య అనే వ్యక్తి ఇంట్లో రాత్రి సెబ్ సిబ్బంది సోదాలు చేశారు. సోదాలు చేసే సమయంలో సెబ్ సిబ్బంది తన కుటుంబ సభ్యుల పట్ల దురుసుగా ప్రవర్తించారని నర్సయ్య ఆరోపించారు. టౌన్ పోలీసులకు నర్సయ్య ఫిర్యాదు చేశారు. అక్రమ మద్యం ఉందన్న సమాచారంతో ఇంట్లో సోదాలు చేశామని అధికారులు తెలిపారు. అంతేకాని ఎవరిపట్లా దురుసుగా ప్రవర్తించలేదని సెబ్ అధికారి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. 


Advertisement
Advertisement