ఎన్టీఆర్ జిల్లా: మామిడితోటలో దాచి ఉంచిన నల్లబెల్లం, గుట్కా ప్యాకెట్లను ఎస్ఈబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విస్సన్నపేట పట్టణ శివారులో మచినేని అరవిందుకు చెందిన మామిడితోటలో ఎస్ఈబీ పోలీసులు సోదా చేశారు. నాటుసారాకు ఉపయోగించే 25 బస్తాల నల్ల బెల్లం, నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అరవింద్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి