కొనసాగుతున్న ఎస్‌ఈబీ దాడులు

ABN , First Publish Date - 2020-08-03T10:21:54+05:30 IST

అక్రమ ఇసుక, మద్యం రవాణా, నాటుసారా స్థావరాలపై ఎస్‌ఈబీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.

కొనసాగుతున్న ఎస్‌ఈబీ దాడులు

కర్నూలు, ఆగస్టు 2: అక్రమ ఇసుక, మద్యం రవాణా, నాటుసారా స్థావరాలపై ఎస్‌ఈబీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎస్పీ ఫక్కీరప్ప ఆదేశాల మేరకు ఎస్‌ఈబీ అడిషినల్‌ ఎస్పీ గౌతమిశాలి ఆధ్వ ర్యంలో నాటుసారా స్థావరాలు, అక్రమ మద్యం, ఇసు క తరలింపుపై పోలీసు సిబ్బంది, ఎక్సైజ్‌ పోలీసుల సమన్వయంతో ఆదివారం దాడులు నిర్వహించారు. జిల్లా అంతటా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తండా లు, కొండలు, అటవీ ప్రాంతాల్లో  పోలీస్‌స్టేషన్‌ పరిధి ల్లో దాడులు చేశారు. అలాగే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో మద్యం అక్రమ రవాణాపై దాడులు చేశారు.


ఈ దాడుల్లో 40 మందిని అరెస్టు చేసి 36 కేసులు నమోదు చేశా రు. 18 వాహనాలు సీజ్‌ చేశారు. అలాగే 391 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకు న్నారు. 220 లీటర్ల నాటుసారా, 5,800 లీటర్ల నాటుసారా ఊటను ధ్వంసం చేశారు. అలాగే అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న నలుగురిపై 2 కేసులు నమోదు చేసి రెండు వాహనాలు సీజ్‌ చేసి 8 టన్నుల ఇసుకను సీజ్‌ చేశారు. ఎక్కడైనా మద్యం, ఇసుక, అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తెలిస్తే 79938224 44కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ ఫక్కీరప్ప విజ్ఞప్తి చేశారు.  


 లాక్‌డౌన్‌ జరిమానాలు 

మార్చి 23 నుంచి  ఆగస్టు 2 వరకు జిల్లాలో  లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జిల్లా వ్యాప్తంగా పోలీసులు వివిధ కేసులు నమోదు చేశారు. 188, 269, 270, 271 సెక్షన్ల కింద నిబం ధనలు ఉల్లంఘించి దుకాణాలు తెరిచిన దుకాణ దారులు, ఇతర వ్యక్తులు మొత్తం 20,728 మందిపై 7,859 కేసులు నమోదు చేశారు.


వీటితో పాటు రో డ్డు భద్రత నిబంధనలు పాటించని వాహ నదారులుపై 1,46,786 ఎంవీ కేసులు నమోదు చేసి రూ.6,59, 07,347ల జరిమానా విధించి 13,704 వాహనాలను సీజ్‌ చేశారు. జిల్లాలో వేర్వేరు ప్రాం తాల్లో పేకాటా డుతున్న 3,165 మందిపై 479 కేసులు నమోదు చేసి, రూ.56,77,494 నగదును సీజ్‌ చేశారు. అలాగే 1,66, 750   మద్యం బాటిల్స్‌, 24,082 .5 లీటర్ల నాటు సా రా, 25,838 కేజీల బెల్లం స్వాధీనం చేసుకున్నారు. అలాగే మాస్కులు లేకుండా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 37,454 కేసులు నమోదు చేసి రూ.28,28,150  జరిమానా విధించారు. 

Updated Date - 2020-08-03T10:21:54+05:30 IST