సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2020-08-03T11:12:41+05:30 IST

వర్షాకాలంలో విష జ్వరాలు, చికెన్‌గున్యా, డెం గ్యూ లాంటి సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ముందు జాగ్తత చర్యలు తీసుకోవాలని

సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి

కామారెడ్డి, ఆగస్టు 2: వర్షాకాలంలో విష జ్వరాలు, చికెన్‌గున్యా, డెం గ్యూ లాంటి సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ముందు జాగ్తత చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ శరత్‌ తెలిపారు. ఆదివారం ఉద యం 10 గంటల పది నిమిషాల కార్యక్రమంలో భాగంగా కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయం ఆవరణలో ఉన్న నీటి నిల్వలను శుభ్రం చేసే కార్యక్రమంలో భాగంగా టైర్లలో ఉన్న నీటి నిల్వ తీసి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.


వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధు లు డెంగ్యూ, చికెన్‌గున్యా లాంటి విష జ్వరాలు ప్రబలకుండా ముంద స్తుగా పటిష్టవంతమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచిం చారు. దోమలు వ్యాప్తి చెందకుండా లార్వాదశలోనే అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రతీ ఆదివారం ఉదయం 10 గంటల పది నిమిషాలకు ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లలోని పూల కుండీల లో, కూలర్లలో, టైర్లలో, డ్రమ్ములలో, పాత్రలలో నిల్వ ఉన్న నీటిని తొలగించాలన్నారు. తద్వారా దోమలు పునరుత్పత్తి చెందకుండా దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు నివారించవచ్చని, ప్రజలు తమ ఇళ్లలో నీరు నిల్వ ఉండకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చేసుకోవాలని ఆయన కోరారు.

Updated Date - 2020-08-03T11:12:41+05:30 IST