అంటార్కిటికాలో ఐస్ గడ్డల కింద ఉష్ణోగ్రతలు, ఉప్పు శాతం ఎలా ఉందో తెలుసుకోవడానికి జపాన్ శాస్త్రవేత్తలకు సీల్స్ సహాయపడుతున్నాయట. ఎలా అంటారా? సుమారు 580గ్రాముల బరువుండే మానిటరింగ్ డివైజ్‌లను సీల్స్‌కు అమరుస్తున్నారట. అంతేకాదు, ఈ డివైజ్‌లు జంతువుల సమాచారాన్ని, వాటి ప్రవర్తన తీరుల్ని సైతం సేకరించడానికి సహాయపడుతున్నాయట.